మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న భారీ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” సంక్రాంతి కి వస్తున్నట్టు అందరికీ తెలిసిందే.కానీ ఇప్పటి వరకూ సినిమా కి సంభందించి ఒక్క బీడీ తాగే మహేష్ బాబు ఫోటోనే మర్చి మర్చి మేకర్స్ విడుదల చేస్తున్నారు తప్ప మరో స్టిల్ కానీ సింగల్ కానీ ఏమి రిలీజ్ చేస్తులేదు.
కానీ మొన్నటి నుండి సితార వాళ్ళు దీపావళి కి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేస్తాము అంటూ సోషల్ మీడియా లో ఫిల్లార్స్ వదుతున్నారు. అన్నట్టు గానే, ఈరోజు వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమో కి అయితే మాస్ రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి రాగా ఇక ఫుల్ సాంగ్ కోసం అంతా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
గత కొన్ని రోజులు నుండి గుంటూరు కారం రిలీజ్ డేట్ విషయంలో కొన్ని గాసిప్స్ వైరల్ గా మారాయి. మేకర్స్ పై సినిమాని వచ్చే ఏడాది జనవరి 11 కి మార్చుకోవాలని ఒత్తిడి ఉందని మారుతుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం ఫిక్స్ అయ్యిన జనవరి 12నే సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఈరోజు ప్రోమో తో కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఆ గాసిప్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టినట్టు అయ్యిందని చెప్పొచ్చు. చూద్దాము ఇంకా 65 రోజులు టైమ్ ఉంది కదా, ప్రస్తుతం సంక్రాంతి 2024 వచ్చే సినిమా లలో చాలా మార్పులు జరుగుతాయా లేక అనుకొన్నట్టే అనౌన్స్ చేసిన సినిమా లు అన్ని సంక్రాంతి భారీలో ఉంటాయో చూడాలి.