గుణ శేఖర్ ‘యుఫోరియా’ షూట్ పూర్తి !  వీడియో విడుదల !

IMG 20250226 WA0284 e1740580619911

గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన న‌టీన‌టులు, సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది.

IMG 20250226 WA0286

ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. యుఫోరియా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

యుఫోరియా టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ తెలియజేసేలా వదిలిన వీడియో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో విఘ్నేశ్ గ‌విరెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌గా సీనియ‌ర్ న‌టి భూమిక ఇందులో ముఖ్య పాత్ర‌లో కనిపించబోతోన్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి వంటి వారు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

IMG 20250226 WA0283

షూట్ పూర్తి అంటూ మహా శివరాత్రి సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.

నటీనటులు :

భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు

సాంకేతిక వ‌ర్గం:

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గుణశేఖర్, సమర్పణ: రాగిణి గుణ, నిర్మాత: నీలిమ గుణ, సంగీతం: కాల భైరవ, సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్ , ఎడిటర్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి, పీఆర్వో : వంశీ కాకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *