Wheere is Originality Boss? కాపీ పేస్టులు ధరువు ఇంకా ఎంత కాలం బాబూ ?

thaman and devisri 1 e1669441906117

మన  తెలుగు సినిమా ఇండిస్ట్రీ లో అతి దారుణమైన సిట్యుయేషన్ నడుస్తుంది. ఒరిజినాలిటీ అనే పదం మార్చి పోయి కాపీ పేస్టులు చేస్తూ కోట్ల కు కోట్లు సంపడిస్తున్నారు మన తెలుగు మ్యూజిక్ మహాన్ భావులు.

అరే బాసూ… కాపీ పేస్టు చేసే వాడికి సిగ్గు లేదు, కానీ చేయించుకొనే దర్శకులు, డబ్బులు ఇచ్చే నిర్మాతలు కొంచెం కూడా బుర్ర పెట్టరా ?. ప్రతి సారీ అదే పద్దతి. ఇప్పుడు ఎక్కడినుండి లేపాలి?.

Thaman మ్యూజిక్ 8 1

గతం లో పక్క ఇండిస్ట్రీ పాట ట్యూన్ కాపీ కొట్టినా తెలిసేది కాదు ఎందుకంటే ఆ ట్యూన్ / పాట ఇక్కడ వినపడదు, పడినా మన శ్రోతలకు భాష అర్దం కాదు అనెల ఉండేది అనుకొంటా !.

కానీ ఇప్పుడు గూగుల్ తల్లి పుణ్యమా అని పాట రిలీజ్  అయిన ఐదు నీమసాలలో దాని ఒరిజినల్ ట్యూన్ తో సహ సోషల్ మీడియా లో తరవల్ల అవుతుంది. ఈ ఒరవడి గత ఐదు సంవత్సరాల నుండి నడుస్తుంది.

devi శ్రీ ప్రసాద్ 1

ప్రస్తుతం తెలుగు లో  పెద్ద హీరోల సినిమాలకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు తప్ప వెరే మ్యూజిక్ డైరెక్టర్ లేనట్టు మన దర్శకులు నిర్మాతలు వాళ్ళకే ఇస్తున్నారు. వారు ఏదో సుడిగుండం లో నావ నిలిచినట్టు అప్పడప్పుడు ఒక ఒరిజినల్ పాట తో అందరినీ మెప్పిస్తారు.

ఆ దెబ్బతో పెద్ద సినిమా తీసే నిర్మాతలు, హీరో లు వారి పేర్లే చెప్తారు యువ దర్శకులకు. కొత్త దర్శకులు బాగా స్టడీ చేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పినా వద్దు మన ఠ నో డి నో ఉన్నాడు కదా వాళ్ళ టీం తో కూర్చుని మంచి ట్యూన్ చేయించుకో అంటారు.

Mythri Movie Makers లోగో

ఈ కొత్త లేదా చిన్న డైరెక్టర్ కి పెద్ద సినిమా అవకాశం వచ్చినట్టు, మిగిలిన పనులు అంతా ఈజీ గా అవ్వవు. ఆ థ / డి దగ్గరకు వెళ్తే ఏముంది బ్రో చేద్దాం అని చెప్పి పంపించేస్తారు. అది చిన్న కొత్త సినిమా డైరెక్టర్ల ఎక్స్పెపిరియన్స్.

virayya high 1 2

విశయానికి వస్తే 2023 తెలుగు సంక్రాంతి కి మెగా స్టార్ చిరు, నట సింహం బాలయ్య సినిమా లు వస్తునాయి వాటి మ్యూజిక్ డైరెక్టర్లు    దేవీశ్రీ ప్రసాద్, థమన్ .  ఈ ఇద్దరే  తెలుగు సినిమా లకు కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు తీసుకుంటూ ఇచ్చేవి మాత్రం  కాపీ ట్యూన్ లు.

veera simha reddy tittle poster 1

వారితో ధరువు వేయించుకొనే దర్శకులు కూడా ఇచ్చినిదే  మహా ప్రసాదం అని వాటినే ఒకే చేయడం ప్రస్తుత సోషల్ మీడియా ట్రోలింగ్ కి ప్రదాన కారణం..

ఇంక నటించే హీరో డబ్బు పెట్టె నిర్మాత వచ్చిన పాట హిట్ అయిందా లేదా అన్నదే చూస్తున్నారు కానీ ఆ పాట పాత సినిమా లొది అని ఆలోచిస్తులేదు.

BOSS PARTY SONG STILLS 3

నిన్నటికి నిన్న మెగాస్టార్ సినిమాకు డి యస్ పి  ఇచ్చిన పాట ఎక్కడి దో, మూలం ఏమిటో నెట్టింటి జ‌నం ఇంటర్ నెట్ చాటింపు వేసారు. అయినా ఆ సినిమా టీం నుండి ఎవరు పట్టించుకో లేదు ? ఎందుకంటే అది బాస్ సినిమా, మాస్ సినిమా కాబట్టి. ట్యూన్ ఇచ్చింది అత్యాదిక అవార్డ్స్ తీసుకొన్న మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి.

jai balayya song ఫ్రమ్ వీర శివ రెడ్డి

నిన్ననే   మరో పెద్ద హీరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్  పాట వచ్చింది, ఆ పాట రెండో సారీ వింటే ఈ ట్యూన్ గతం లో పెద్ద హిట్ సినిమా పాట ల ఉందే అని నెట్ లో చెక్ చేస్తే అప్పటికే ట్రోల్స్  స్టార్ట్ అయ్యాయి.

ose రాములమ్మ

అత్యంత దారుణంగా, హేయంగా నీస్సిగ్గుగా  కాపీ ట్యూన్ అందించాడు మన తమన్ అంటూ ట్రోల్స్ పెరిగిపోయాయి. గతంలో దాసరి దర్శకత్వం లో విజయశాంతి లీడ్ రోల్ లో వచ్చిన ఒసే రావులమ్మా సినిమా కు  వందేమాతరం శ్రీనివాస్ అందించిన టైటిల్ సాంగ్ ను  ఎత్తుకొచ్చేసాడు థమన్.

ఇంతకంటే ధారుణం ఉంటుందా ? దాని మీద సోషల్ మీడియా రెండు రోజులనుండి. అయినా ఎవరికి పడుతుంది. మన పాట జ‌నంలోకి వెళ్లిందా లేదా అన్నది తప్ప మరో ఆలోచన లేదు. ఈ కాపీ ట్యూన్ లు అందించేందుకు స్టార్ హోటళ్లలో ఖరీదైన రూములూ, విదేశీ ప్రయాణాలు, మరలా కవర్ సాంగ్లు కలిపి కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్లు గుంజేస్తున్నారు.

ఈ కాపీ పేస్టుల జమానా అరికట్టడానికి ఎవరిని బాద్యులను  చేయాలి, ఇచ్చిన ట్యూన్ ను తీసుకునే దర్శకులనా లేక హిట్ పాట అయితే చాలు అని తలుపే నిర్మాతనా మీ ఇస్తామే నా ఇస్టం అనే హీరో నా ?

పాట చేయించుకొనే వారికి  రిజ‌క్ట్ చేయగల దమ్ము వుండాలి . అప్పుడే ఒరిజినల్ ట్యూన్ లు వస్తాయి. లేకుంటే ఇలా కట్ అండ్ పేస్ట్ లే ది.క్కు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *