సందీప్ కిషన్ హీరో గా దివ్వాంశ కౌశిక్ము హీరోయిన్ గా ఇంకా విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ముక్య పాత్రలలో తెలుగు ఇండిస్ట్రీ లో పెద్ద నిర్మాతలు ముగ్గురు కలిసి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం మైకేల్.

ఐదు భాషల లో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న ఈ మైఖేల్ సినిమా లో కూడా పలు భాషల నటులను తీసుకుని పాన్ ఇండియాగా తయారు చేస్తున్న చిత్రం ఈ మైఖేల్.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం, విడుదల జరుపుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు గా తమిళ దర్శకుడు రంజిత్ జయ్ కోడి ని తీసుకొని మన తెలుగు నిర్మాతలు పెద్ద సాహసమే చేస్తున్నారు.

మైఖేల్ నిర్మాతలు ఆసియన్ సునీల్, భరత్ చౌదరి, రామ్మోహనరావు భారీ బడ్జెట్ తో తెలకు ఎక్కిస్తున్న ఈ మైఖేల్ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా తయారవుతున్నది.
మైఖేల్ సినిమాను డిసెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ డెటె ఎందుకు అంటే డిసెంబర్ 25 న క్రిస్మస్ హాలిడే తరువాత నుంచి పండగ వరకు సినిమాలు లేవు. ఈ టైమ్ లో అయితే బాగుంటుందనే ఆలోచనతో 30న సినిమా రిలీజ్ కి టార్గెట్ గా సినిమాను రెడీ చేస్తున్నారు.

మైఖేల్ సినిమాలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ నెగిటివ్ షేడ్ వున్న పాత్ర పోషిస్తున్నాడు అనేది బయట టాక్. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతుపతి వి కీలకపాత్రలు పోసిస్తున్నారు.
మైఖేల్ సినిమా కి శామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్రిశాట్ ఏరియాలో పలు ఔట్ డోర్ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

ఇంకా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మైఖేల్ నిర్మాతలు అనుకొన్న డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. అప్పటివరకు ఎవరు ఎన్ని చెప్పినా విని ఊర్వ కోవడమే ఉత్తమం.