మైత్రీ మూవీస్-పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ అంటే పవన్ ఫాన్స్ లో పునకాలు వచ్చాయి. హరీష్ – పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కాంబో లో ఆ మాజిక్ మరలా రిపీట్ అవుతుంది అని ఎంతో కాలంగా వయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లోనూ కొన్ని ప్రముక వెబ్ సైటు లలోనూ ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. అది ఏంటంటే…..ఈ మూవీ కోసం హరీష్ శంకర్ కథ చెప్పి పవన్ ను ఒప్పించలేకపోయారని వార్తలు వస్తూనే వున్నాయి.
ఇంకా ఇప్పటి వరకూ ఆ కాంబో లో ఒక భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రం బయటకు వచ్చింది . అంతకు మించి ఈ సినిమా అంగుళం కూడా ముందుకు జరగలేదు అనేది జగమెరిగిన సత్యం.
ఇప్పుడు వార్త ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇక లేనట్లే అని వార్తలు వినిపించడం మొదలైంది. ఇంకా కొన్ని విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఈ సినిమా ఇక వుండదని తెలుస్తోంది అంటూ ప్రచారం మొదలైంది.
ఇంకా ఎన్నికల నేపథ్యంలో చేతిలో వున్న హరి హర వీరమల్లు సినిమా ఒక్కటే పూర్తి చేసే ఆలోచనలో పవన్ వున్నట్లు అందువల్ల మైత్రీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చేస్తారని అయితే ఇన్నేళ్ల తరువాత మరి అడ్వాన్స్ వెనక్కు ఇవ్వడం అంటే వడ్డీ కూడా ఇవ్వాల్సి వుంటుంది అని తాజా ప్రచారం.
వడ్డీ ఇస్తారో? మైత్రీ సంస్థ మొహమాటానికి పోయి వదిలేస్తుందో చూడాలి అంటూ నెగిటివ్ వార్తలు మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ ఆగిపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్ తో ఆల్టర్ నేటివ్ ప్రాజెక్టు చేయడానికి మైత్రీ సంస్థ సన్నాహాలు చేస్తోంది ఆ వార్త.
కానీ మా రిపోర్టర్ కి అందిన సమాచారం ఏంటంటే…మైత్రీ సంస్థ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నుంచి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరకు డేట్స్ కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు, అలా డేట్స్ వస్తే హరీష్ శంకర్ కధ తో సినిమా చేయాలి అని ఉన్నారు. కానీ ఇంకా ఎక్కడా ఏదీ ఫైనల్ కాలేదు అని బొగట్టా….
మైత్రీ సంస్థ నుండి విజయ్ కు ఇంకా కథ చెప్పలేదు. కథ చెప్పాలి..ఒకె అనాలి. ఇదే సమయంలో విజయ్ దేవరకొండతో సినిమా కోసం గీతా, దిల్ రాజు, సితార సంస్థలు తమ ఆస్థాన దర్శకులతో కథలు రెడీ చేయుస్తున్నాయి.
అలా ఆ సంస్థల కధ లను మించిన కథను హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ కు చెప్పాల్సి వుంటుంది. అదే అతి పెద్ద టాస్క్ అని మాకు అందిన సమాచారం.
ఈ న్యూస్ లో ఇంకా అప్ డేట్స్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తాము.