మహేష్ బాబు 28 వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో హారిక హాసిని నిర్మాణం లో స్టార్ట్ అయ్యి మూడు రాత్రులు, ఆరు రోజులు ఘాట్ చేసుకొని కొన్ని అనివార్య కారణాల వలన ఆగింది అనేది అందరికీ తెలిసిన వార.
కానీ ఇప్పుడు ఈ సినిమా మీద అతి బయంకారమైన న్యూస్ ఆన్లైన్ లో ట్రోల్స్ , గ్యాసిప్ గా సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. అసలు ఈ సినిమా వుంటుందా ? లేక ఆగిపోయిందా అనే అనుమానాలు కూడా వినిపించేస్తున్నాయి.
దర్శక దిగ్గజం త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్ తయారు చేసి హీరో మహేష్ ను ఒప్పించలేకపోతున్నారు అన్నది ఒక కారణం అంటున్నారు నెటిజన్స్. ఇంకా ఈ సినిమా మీద రకరకాల వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ ఇంకా పవన్ కళ్యాణ్ స్వంత పనులు కోసం టైమ్ స్పెండ్ చేస్తూ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ తయారీ లొ స్వయంగా కూర్చో కుండా ఓ టీమ్ ను పెట్టుకుని పనులు అప్పగిస్తున్నారని మహేష్ బాబు టీం భావిస్తున్నారట.
అసలు మహేష్ బాబు ఫస్ట్ షెడ్యూలు అర్థాంతరంగా ఆపేసి విదేశాలకు వెళ్లడం వెనుక, స్క్రిప్ట్ మొత్తం పకడ్బందీగా చేయమని త్రివిక్రమ్ కీ టైమ్ ఇవ్వడం కోసమే అని అంటున్నారు.
అప్పుడు మధ్యలో స్క్రిప్ట్ వినిపించేందుకు లండన్ వెళ్లడానికి త్రివిక్రమ్ రెడీ అయినా వద్దని, మరింత సమయం తీసుకోమన్నారని వార్త వైరల్ అయ్యింది. తరవాత మహేష్ ఇండియా తిరిగి వస్తున్నారు, త్రివిక్రమ్ తో కలిసి స్క్రిప్ట్ విషయంలో వున్న గ్యాప్ లను ఫిల్ చేసుకొంటారని చెప్పారు.
ఆ మద్యలో మహేష్ బాబు ఇంట్లో చోటు చేసుకొన్న పరిణామాలు కూడా సినిమా స్టార్ట్ కాకా పోవడానికి స్టార్ట్ అయ్యినా రెండో సెడ్యూల్ మొదలు కాకపోవడానికి కారణాలు అంటూ, ఇంకా మహేష్ తల్లి గారి మరణం, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకశ్మీక మరణం తో మరో పెద్ద బ్రేక్ పడింది.
మహేష్ క్రియేటివ్ టీం నుండి అందుతున్న తాజా సమాచారం ఏంటంటే ఈసారి మహేష్ బాబు స్క్రిప్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా వున్నారని, మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే తప్ప సెట్ మీదకు వెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
ఇంకా త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ కోసం టైమ్ తీసుకొంటే ఈ సినిమా ఆపేసి రాజమౌళి సినిమా అయినా మొదలు పెడతారు కానీ, స్క్రిప్ట్ సంతృప్తి నివ్వకుండా ఈసారి సినిమా చేసేది లేదని మహేష్ భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ ఇతరత్రా పనుల మీద బిజీ అయిపోయారు. తన భార్య ను నిర్మాతగా మార్చి ఫార్చూన్ 4 సినిమా బానర్ మీద ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్ తో ధనుష్ హీరో గా తెలుగు తమిళ సినిమా సార్ / వాతి నిర్మిస్తున్నారు.
ఇంకా భార్య బేనర్ కోసం కొత్త సినిమా కథలు, కాస్టింగ్ లు, క్వాలిటీ చెక్ లు త్రివిక్రమ్ చూసుకోవాల్సి వస్తోంది. అలాగే పవన్ సినిమాల వ్యవహారాలు, వాటికి స్క్రిప్ట్ లు ఇవ్వడం కూడా త్రివిక్రమ్ నెత్తిన వేసుకున్నారు.
రచయితగా త్రివిక్రమ్ ఎప్పుడూ పాస్ నే. కానీ కథకుడిగా దర్శకుడిగా మాత్రం కాదు. ఇప్పుడు అదే సమస్య గా మారుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇప్పుటికే ఎన్టీఆర్ తో సినిమా అనుకుని క్యాన్సిల్ చేసుకొని మహేష్ బాబు తో సినిమా స్టార్ట్ చేసి మళ్లీ మహేష్ తో కూడా అలాగే కాన్సిల్ బాట పడితే ఏంటి పరిస్తితి అని ఇంటర్నల్ గా చాలా చర్చలు జరుగుతున్నాయి.
చూద్దాం మహేష్ బాబు ప్రస్తుతం తండ్రి మరణం తో భాద తో కూడిన ఫ్యామిలీ భాద్యతలు నెత్తిన పెట్టుకొని దిగ్బ్రాంతి లో ఉన్నారు. కొంత సమయం తర్వాత మిగిలిన విశయాలు బయటికి వస్తాయి. అప్పటి వరకూ ఎవరికి తోసిన స్క్రిప్ట్ వారు రాసుకొంటారు. సినీ ప్రేక్షకులను అయో మయం లోకి నెట్టేస్తారు.