ఏంటో మన క్రియేటివ్ డైరెక్టర్ లు .. ఏది చేసిన ఆడియన్స్ కోసమే అంటున్నారు. హాలీవుడ్ లో వస్తున్న సూపర్ హీరో కధలు.. పాత్రలూ కేవలం కల్పితాలు మాత్రమే అంటూ నిజమైన సూపర్ హీరో మన మైతిలాజికల్ కేరాక్టర్ హనుమాన్ మాత్రమే అని మన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ చెప్పుకొచ్చారు.
ప్రశాంత వర్మ కూడా మరో తమిళ డైరెక్టర్ (లోకేష్ కనక రాజు) పంథా లో నే ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో ఫిల్మ్స్ చేస్తాను అంటున్నారు.
అంతా బానా ఉంది. మన పౌరాణిక కధ లలోని మంచి పాత్రల కు ప్రస్తుత టెక్నాలజీ ఉపయోగించి ఇప్పటి యూత్ కి అర్దం అయ్యే విధంగా చెప్తే కనెక్ట్ అవుతారు.
కానీ, చిన్న అంటే 80 సెకండ్స్ టిజర్ కట్ చేయాడానికి ఆరు నెలలు టైమ్ తీసుకోవాలా. ఇదే విశయాన్ని ప్రశాంత వర్మ హనుమాన్ టిజర్ రిలీజ్ రోజు స్టేజ్ మీదనే మైక్ పట్టుకొని మరీ చెప్పారు.
ఇప్పటి క్రియేటివ్ డైరెక్టర్లు అందరూ ఫస్ట్ లుక్, టీజర్ ఎలా చూపించాలి అన్నా దానిమీద పెట్టె టైమ్, మనీ శ్రద్ద ని, కధ కధనం మీద పెడితే సినిమా రిసల్ట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమా లా ఉంటుంది.
టీజర్ ను బట్టే సినిమా లెవెల్ ను అంచనా వేస్తున్నారు ప్రస్తుత సోషల్ మీడియా యూత్. అందుకే టీజర్ కట్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు దర్శకులు, నిర్మాతలు.
ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ టిజర్ ఆ సినిమా భవిష్యత్ నే అయోమయంలోకి తోసేసింది. సోషల్ మీడియా దెబ్బకు అది పురుష్ టీం సినిమా విడుదల డేట్ నే వేకక్కి జరిపి మరలా గ్రాఫిక్స్ వర్క్ లో లీనమయ్యారు. మొత్తం సినిమా క్వాలిటీ మీదే అనుమానం వచ్చేసింది.
నిన్న రిలీజ్ అయ్యిన హనుమాన్ టీజర్ లో సినిమా ఎలా వుండబోతొంది అన్న క్లారిటీ తో పాటు, విజువల్స్ కూడా ఆకట్టుకునేలా చేసారు. అసలే ఇప్పుడు భక్తి సినిమాల ట్రెండ్ నడుస్తోంది.
రామ్..రామ్ అంటూ రామనామజపం, హనుమంతుడి మీద తీసిన డివోషనల్ ఫాంటసీ కావడంతో హనుమాన్ చిత్ర యూనిట్ టిజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి చాలా హ్యాపీ గా ఉన్నారు.
కా చిన్న హీరో అయిన నిఖిల్ చేసిన ర్తికేయ 2 సినిమా నికిల్ ని వందకోట్ల క్లబ్ లోకి చేర్చేసింది. జస్ట్ డివోషనల్ టచ్ చేసిన వండర్ అది. ఇప్పుడు హనుమాన్ కూడా అలాగే కనిపిస్తోంది. హీరో తేజ సజ్జా సంగతి పక్కన పెడితే కాన్సెప్ట్, గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ కలిసి టీజర్ ఏదో మాజిక్ చేసింది.
సినిమా కూడా టిజర్ లనే ఆకట్టు కుంటే ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మారాన్ని ఇండియన్ సూపర్ హీరో సినిమా లు ఆశించ వచ్చు.