Gopichand’s Bheema Movie OTT Update: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భీమా”!

IMG 20240425 WA0059 e1714131120607

గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “భీమా” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ రిలీజ్ చేసిన వీడియోలో ప్రేక్షకుల్ని “భీమా” చూడాల్సిందిగా కోరారు. ‘మ్యాజిక్ ఆఫ్ భీమా మీ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మీరంతా తప్పక చూడండి’ అని గోపీచంద్ అన్నారు.

మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు “భీమా” సినిమాను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్కువగా చూస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు.

“భీమా” చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ “భీమా” సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *