GODFATHER PRODUCER INTERVIEW ABOUT COLLECTIONS:”గాడ్ ఫాదర్” సినిమాని ఎవరికీ అమ్మలేదు అంటున్న నిర్మాత ఎన్ వి ప్రసాద్ !

nv prasad e1665589606630

”గాడ్ ఫాదర్’‘ సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతగా విడుదల చేశాం. ఊహించినదాని కంటే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్న నిర్మాత ఎన్ వి ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చదువుడమా  …

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసినటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

తమన్ చిరు మోహన్ రాజా 1

మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.

అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత ఎన్వి ప్రసాద్ ”గాడ్ ఫాదర్” గ్రాండ్ సక్సెస్ ని మా రిపోర్టర్ తో  పంచుకున్నారు.

ఆ ఇంటర్వ్యూ విశేశాలు చదువదామా…..

”గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. కలెక్షన్స్ ఎలా వున్నాయి ?

ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్ గా వుంది.

godfather day 1 collections gross 1

కలెక్షన్స్ లో ఇంత భారీ నెంబర్స్ ఊహించారా ?

కలెక్షన్స్ మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా వున్నాయి. లూసిఫర్ ని అందరూ చూశారు. ఆ సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు.

ఓవర్సీస్ తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా వున్నాయి. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. అది వారి కల్చర్ మూవీ.

వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్ ని ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్ ని తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.

critics association met GodFather chiru 4 1

గాడ్ ఫాదర్ విజయం పై చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమన్నారు ?

సక్సెస్ మీట్ లో మేమందరం మాట్లాడాం. సమిష్టి కృషితో సినిమా చేశాం. చాలా సాహసంతో కూడిన సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఇచ్చాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. నిర్మాణ సంస్థగా చాలా ఆనందంగా వుంది.

ఒక గొప్ప విజయం ఇచ్చిన తృప్తి మాలో వుంది. గాడ్ ఫాదర్ విజయం పట్ల మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం. మా బ్యానర్ కి మైల్ స్టోన్ సినిమా. ఇదే ఉత్తేజంతో రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు తీయడానికి ఆక్సిజన్ లా పని చేసింది.

యూనిట్ అంతా పడిన కష్టానికి తగిన ఫలితం ప్రేక్షకులు గొప్ప విజయం రూపంలో ఇచ్చారు.

GODFATHER 100 Cr GROSS WORLDWIDE

తెలుగు రాష్ట్రాలలో ఎంత వరకు కలెక్షన్ రాబట్టింది ?
తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. విదేశాల్లో కూడా కలెక్షన్స్ బలంగా వున్నాయి. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.1 మిలియన్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి.

రామ్ చరణ్ గారి స్పందన ఎలా వుంది ?

చరణ్ బాబు గారి ఆలోచన వలనే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత రామ్ చరణ్ గారి ఆనందం మాటల్లో చెప్పలేం. ఆయన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు.

చిరంజీవి గారి సినిమా అంటే పాటలు డ్యాన్సులు వుంటాయి కదా..అవి లేకుండా సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
పాటలు, అద్భుతమైన డ్యాన్స్ లని తెలుగు సినిమాకి పరిచయం చేసింది చిరంజీవి గారు. ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఒక కొత్త తరహాలో చిరంజీవి గారిని చూపించాలని ఒక చేంజ్ ఓవర్ ఫిలిం చేశాం. దీనికి ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఇది పెద్ద మార్పుకు సంకేతం.

GODFATHER CORE TEAM

దర్శకుడు మోహన్ రాజా గురించి ?
మోహన్ రాజా చాలా హార్డ్ వర్క్ చేసి అద్భుతమైన మార్పులు చేశారు. తమన్ కూడా తన అద్భుతమైన మ్యూజిక్ తో సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారు.

దసరా, దీపావళి మధ్య గాడ్ ఫాదర్ ఒక బ్రిడ్జ్ లా నిలిచింది కదా ?
గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్.

టికెట్ ధరలు పెంచకపోవడం కూడా కలిసొచ్చిందని భావిస్తున్నారా ?
టికెట్ ధరలు పెంచాలనే ఆలోచన మొదటి నుండి లేదు మన సినిమాలకి మన ఆడియన్స్ కి ఈ రేట్లు సరిపోతాయి. గాడ్ ఫాదర్ ఎగ్జిబిటర్లు అందరూ చాలా ఆనందంగా వున్నారు.

కోవిడ్ నుండి కూడా ఇండస్ట్రీ దాదాపు బయటపడింది. ప్రేక్షకులని ద్రుష్టి పెట్టుకొని వారి అభిరుచి తగిన కథలు ఎంపిక చేసుకోవాలి

అంటూ మా ఇంటర్వ్యూ ముగించారు nv ప్రసాద్ గారు.

అల్ ది బెస్ట్ చెప్పి ముగించాము. 

-కృష్ణా ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *