“Girls Don’t understand”, with twists in a middle-class love story మధ్యతరగతి ప్రేమకథలోని ట్విస్టులతో “అమ్మాయిలు అర్థంకారు

96145085 2440 429C BC8E 03E0762ADBEC

అవార్డు సినిమాల దర్శకుడిగా నరసింహ నందికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. “1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి సామాజిక ఇతివృత్తంతో అనేక సినిమాలను ఆయన రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు.

శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ విడుదల చేశారు.

అనంతరం టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “అవార్డు చిత్రాల దర్శకుడిగా నరసింహ నంది చిత్ర పరిశ్రమలోని ఎందరో నవతరం దర్శకులకు ప్రేరణగా నిలిచారు. మధ్యతరగతి ప్రేమకథతో ఆయన తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.

28F39900 6595 423F B364 9FAE599BFDAD

అనంతరం చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, “నేను ఇంతవరకు తీసిన చిత్రాలకు భిన్నంగా మరో కొత్తకోణంలో ఈ చిత్రాన్ని తీశాను. నాలుగు జంటల ప్రేమకథలో ఏర్పడే మలుపులు, భావోద్యేగాలతో నవరసభరితంగా ఈ సినిమా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే…నిజ జీవితానికి దగ్గరగా మధ్య తరగతి జీవితాలలో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దానివల్ల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో అన్న అంశాన్ని ఇందులో చర్చించాం. ఓ రచయిత అన్నట్లు మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో… అలాగే మధ్యతరగతి జీవితాలలో అన్ని ట్విస్టులు ఉంటాయన్న కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈషే అబ్బూరి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన కర్ర వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాసను నేపధ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. త్వరలోనే ట్రైలర్ ను, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పారు.
హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ, తాము చేసిన పాత్రలు తమకెంతో మంచి పేరు తెచ్చి పెడతాయని, చిత్తూరు యాసను కస్టపడి నేర్చుకుని మరీ ఈ సినిమాలో నటించామని చెప్పారు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో డిస్ట్రిబ్యూటర్ గనిరెడ్డి, పలువురు చిత్ర బృందం పాల్గొని, తమ అనుభవాలను వివరించారు.

ఈ సినిమాలోని ఇతర పాత్రలలో కొలకలూరి రవిబాబు, మురళి (ప్రజాశక్తి), గగన్, వీరభద్రం, శంకర్ మహంతి, మల్లేష్, మండల విజయభాస్కర్, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం. సాంకేతిక బృందం: ఛాయాగ్రహణం: ఈషే అబ్బూరి, సంగీతం: నరసింహ నంది, నేఫధ్య సంగీతం: రోణి ఆడమ్స్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, కమల్ విహస్, ప్రణవం, సహ నిర్మాతలు: అల్లం వెంకటరావు చౌదరి, షేక్ రహమ్ తుల్లా, మీరావలి, నిర్మాతలు: నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య, రచన, దర్శకత్వం: నరసింహ నంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *