GHOST Movie Telugu Review & Rating: శివన్న ఘోస్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చిందా ? లేదా ? 

ghost review by 18F movies e1699114921572

  మూవీ : ఘోస్ట్ (Ghost Review)  

విడుదల తేదీ : నవంబర్ 04, 2023

నటీనటులు: శివ రాజ్ కుమార్, జయరామ్, అనుపమ్ ఖేర్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్యప్రకాష్, అభిజీత్ తదితరులు

దర్శకుడు : ఎంజి శ్రీనివాస్

నిర్మాత: సందేశ్ నాగరాజ్

సంగీతం: అర్జున్ జన్యా

సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహా

ఎడిటర్: దీపు ఎస్ కుమార్

ghost review by 18F movies 4

మూవీ రివ్యూ: ఘోస్ట్ తెలుగు రివ్యూ (Ghost Movies) 

కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలైన సినిమా ‘ఘోస్ట్’. ఈ సినిమా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

ghost review by 18F movies 5

కధ పరిశీలిస్తే (Story Line): 

జైల్  ప్రైవేటీకరణ కోసం 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మాజీ సీబీఐ ఆఫీసర్ వామన్ శ్రీనివాస్‌ (ప్రశాంత్ నారాయణన్) కల పలించి అదే  జైలు లొని ఒక బ్లాక్ పునః -నిర్మాణానికి భూమి పూజ చేయడాని వెళతాడు. అలా వెళ్లిన వామన్ బృందం అదే జైల్ లో  కిడ్నాప్‌కు గురి అయి మరో బ్లాక్ లో బంధించబడతారు.

జైల్ లో హొస్టేజ్ గా మారిని మినిస్టర్, మాజీ సిబిఐ అధికారిని విడిపించడానికి  చరణ్ రాజ్ (జయరాం) అనే అధికారిని ప్రభుత్వం రంగంలోకి దించుతుంది.

ghost review by 18F movies 1

ఘోస్ట్ అలియాస్ బిగ్ డాడీ (శివ రాజ్ కుమార్) తన ముఠా తో జైలును టార్గెట్ చేసి ఒక బ్లాక్ ని తన అధీనం లోకి తీసుకొని ఎటాక్ లో గాయపడిన  మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) ని మరికొంత మంది ఖైదీ ల కు, జైలర్ కు ట్రీట్మెంట్ చేయిస్తూ తన దగ్గర హొస్టేజ్ గా పెట్టుకొని, అధిరకారులకు, పోలీస్ లకు  కొన్ని డిమాండ్ లు పంపుతూ తన టార్గెట్ కాంప్లెట్ చేస్తాడు ఘోస్ట్.

ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎందుకు జైల్ ని టార్గెట్ చేశాడు ? 

ఘోస్ట్ ఎవరు ? , అతని గతం ఏమిటి ?, ఘోస్ట్ ఎందుకు వామన్ రావు ని టార్గెట్ చేస్తాడు?, 

అసలు అతను ఘోస్ట్ గా ఎందుకు మారాడు ?,

అలాగే ఆ జైలునే ఎందుకు టార్గెట్ చేశాడు ?,

అసలు వామన్ శ్రీనివాస్ కి – బిగ్ డాడీ కి మధ్య కనెక్షన్ ఉందా ?

అనే ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ అనిపిస్తే వెంటనే సినిమా చూసేయండి. లేక పోతే మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకోండి.

ghost review by 18F movies 3

కధనం పరిశీలిస్తే (Screen – Play) : 

ఈ ఘోస్ట్ కథలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా కధనం (స్క్రీన్ – ప్లే ) ద్వారా అయినా  ఇంట్రెస్ట్ గా  ప్రెసెంట్ చేసి ఉండవలసింది.  దర్శకుడిగా ఎంజి శ్రీనివాస్ మంచి కథ  తయారు చేసుకొన్న సీన్స్ ని ఆసక్తికరమైన కథనంతో ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి.

అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. నిజానికి క్లైమాక్స్ లో హీరో క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా నెక్స్ట్ ఏమిటి అనే ఇంటరెస్ట్ ఆడియన్స్ కి కలగదు.

శివన్న ఘోస్ట్ సినిమా  మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ , దర్శకుడు ఎంజి శ్రీనివాస్ మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్  బ్లాక్స్ బాగా తీసినా అవి న్యాచురల్ గా లేవు. కావాలని ఇరికించినట్టు ఉన్నాయి.  మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.

పైగా భారీ బడ్జెట్ తో తీసిన ఈ  ఘోస్ట్ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన శ్రద్ధ,   కధను నడిపే ఇన్విస్టిగేషన్  సీన్స్ మీద పెట్టకుండా చాలా సింపుల్ గా  ముగించడం అంతగా రుచించదు. రెండు వారాలు ఆగితే ఓటీటీ లో చూద్దాం అనుకొనే వాళ్ళు దియేటర్ కి రాకపోవచ్చు.

ghost review by 18F movies 9

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు ఎంజి శ్రీనివాస్ తీసుకొన్న స్టోరీ ఐడియా బాగున్నా, ఆ ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ ను గాని, కధనాన్ని కానీ   రాసుకోలేదు అనిపిస్తుంది. చాలా సీన్స్ హీరో ఎలివేశన్ కోసం తీసినట్టు ఉన్నాయి కానీ, కధ కు అవశ్యం అన్నట్టు లేదు. ఈ కధ ను మంచి సస్పెన్స్ తో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ బోరింగ్  రొటీన్ స్క్రీన్ – ప్లే తో  సింపుల్ గా హ్యాండల్ చేశారు శ్రీని.

కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు శ్రీని మాత్రం  హై టెక్నికల్ వేల్యూస్‌ తో బాగా తెరకెక్కించాడు. మాస్ ఆడియన్స్ కి, శివన్న ఫాన్స్ కి విజువల్ ఫీస్ట్ లా ఉంది ఘోస్ట్ మూవీ.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ ఘోస్ట్ లో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లో శివ రాజ్ కుమార్ చాలా వైల్డ్ గా కనిపించారు. పవర్ ఫుల్ పాత్ర‌లో తన  సహజ నటన తో శివన్న ఆకట్టుకున్నాడు. తన  బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్ర ను పూర్తిగా డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో శివన్న తన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో రగ్గడ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

ghost review by 18F movies 8

 జయరామ్ పాత్ర కూడా ఆకట్టుకొంటుంది. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో జయరామ్ నటన చాలా బాగుంది.

తండ్రి పాత్రలో కనిపించిన అనుపమ్ ఖేర్ తన నటనతో మెప్పించారు. అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్యప్రకాష్, అభిజీత్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

ghost review by 18F movies 11

 అర్జున్ జన్యా అందించిన సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ కి అయితే BGM అద్భుతంగా ఉంది. ఈ ఘోస్ట్ సినిమా OST (ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ )  లు రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ వస్తాది.

మహేంద్ర సింహా సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా మహేంద్ర సింహా దృశ్యాలని బాగా తెరకెక్కించారు. జైల్ బర్డ్ ఐ వ్యూ అండ్ నైట్ షాట్స్ చాలా బాగా ఉన్నాయి.

దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని సందేశ్ నాగరాజ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఘోస్ట్ మూవీ చాలా రిచ్ గా ఉంది.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ghost review by 18F movies 10

శివన్న ని బిగ్ డాడీ గా చూపిస్తూ వచ్చిన ‘ఘోస్ట్’  సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు శివరాజ్ కుమార్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకుట్టుకొంటాయి. అయితే కొంత మ్యాడ్ యాక్షన్ ఎపిసోడ్స్ స్క్రీన్ – ప్లేతో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని ఏమోసనల్ డ్రామా సినిమాకి కొంత మైనస్ అయ్యాయి.

సినిమా తెలుగు డబ్బింగ్ కూడా బాగాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగున్నా  సినిమా మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కస్టం. మాస్ యాక్షన్ ఈస్టపడే వాళ్ళు మాత్రం చూడవచ్చు.

Ghost trailer launch event 3

చివరి మాట: ఘట్స్ తో ఘోస్ట్ చూడాలి !

18F RATING: 2.75 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *