Geethanjali Malli Vachindhi Teaser Launch in Graveyard ? : బేగంపేట శ్మశానం లో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ !

Geethanjali Malli Vachindhi Teaser Launch in Graveyard e1708628680629

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్.

గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’లో హీరోయిన్ అంజలికి ఎంతో ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాదు, ఆమె కెరీర్‌ మైల్ స్టోన్ మూవీ 50వ చిత్రంగా అలరించనుంది.

Geethanjali Malli Vachindhi Teaser Launch in Graveyard1 e1708628818426

హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన రావటమే కాదు అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.హారర్ చిత్రం కావటంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్‌ను ఇలా ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగటం ఇదే తొలిసారి.

గీతాంజలి సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేేష్, షకలక శంకర్, సత్య, సునీల్, రవి శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలో మెప్పించనున్నారు.

Geethanjali Malli Vachindi teaser

అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఇది ఆయన తొలి తెలుగు సినిమా కావటం విశేషం. హైదరాబాద్, ఊటీ బ్యాక్ డ్రాప్స్‌లో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా కథాంశం ఉంటుంది. హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో ఈ సీక్వెల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

యువ ప్రతిభను ప్రోత్సహించటంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఎప్పుడూ ముందుంటుంది. నిన్నుకోరి, నిశ్శబ్దం వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అమెరికాలోని అట్లాంటాకు చెందిన కొరియోగరాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.

ఎం.వి.వి.సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ రూపొందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని, సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంటక్ కథను అందించారు. ఎం.వి.వి.సత్యనారాయణ, జి.వి. సినిమాను నిర్మిస్తున్నారు. సీక్వెల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టటానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

నటీనటులు:

అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ తదితరులు

సాంకేతిక వర్గం:

స్టోరి – కోన వెంకట్,స్క్రీన్ ప్లే – కోన వెంకట్, భాను భోగవరపుమాటలు – భాను భోగవరపు, నందు సావరిగన,దర్శకత్వం – శివ తుర్లపాటి,సంగీతం – ప్రవీణ్ లక్కరాజు,కెమెరా – సుజాత సిద్ధార్థ,ఎడిటర్ – చోటా కె.ప్రసాద్,ఆర్ట్, నార్ని శ్రీనివాస్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నాగు.వై,పి.ఆర్.ఒ – వంశీ కాక,పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *