GEETA ARTS KARTIKEYA NIKIL’S 18 PAGES MOVIE RELEASE DATE LOCKED: నిఖిల్, అనుపమ ’18 పేజీస్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్, డిసెంబర్‌ నెలలో ఎప్పుడంటే ? 

18 PAGES RELESE DATE FIXED 1

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddharth) కథానాయకుడిగా నటించిన సినిమా ’18 పేజీస్’ . ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్.

తెలుగు టాప్ దర్శకుడు సుకుమార్ (Sukumar) అందించిన కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ సంస్థలపై ‘బన్నీ’ వాస్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ నెల 23 న  ’18 పేజీస్ సినిమా  ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు

18 PAGES RELESE DATE FIXED 1
తెలుగులో మాత్రమే కాదు  హిందీ, తమిళ్ ల్లో  కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన ‘కార్తికేయ 2’ సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ కలసి  మరోసారి జంటగా నటించిన సినిమా ’18 పేజీస్’. డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ఈ రోజు నిర్మాత ‘బన్నీ’ వాసు వెల్లడించారు.

’18 పేజీస్’తో ‘కార్తికేయ 2’ సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది.

‘కాంతార’ వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.

18 PAGES NIKIL
 ’18 పేజీస్’ చిత్రీకరణ ప్రస్తుతం చివరి  దశకు చేరుకుంది. ‘కార్తికేయ 2′ విడుదల, ప్రచార కార్యక్రమాల కోసం దేశవ్యాప్తంగా వివిధ నగరాలు తిరిగిన నికిల్, అనుపమ  కొంచెం విరామం తర్వాత ’18 పేజీస్’ సెట్‌కు తిరిగి వచ్చారు.

18 PAGES NIKIL ANUPAMA

అక్టోబర్ మంత్ ఎండ్ కి  షూటింగ్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. 

‘పుష్ప’  చిత్ర దర్శకుడు సుకుమార్ పేరు కూడా ’18 పేజీస్’ పోస్టర్లపై ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. లవ్ స్టోరీ కావడంతో అక్కడ విడుదల చేస్తారో? లేదో? వెయిట్ అండ్ సి.
18 APGES GLIMPS e1666810756185

’18 పేజీస్’ గ్లింప్స్‌ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అది చూస్తే… ‘నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది… ప్రేమించడానికి రీజన్  ఉండకూడదు! ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు అని’ అంటూ నిఖిల్ చెప్పే డైలాగుతో ఆ గ్లింప్స్‌ స్టార్ట్ అయ్యింది.

ఆ తర్వాత ‘నన్నయ్య రాసిన కావ్యం ఆగితే… తిక్కన తీర్చేనుగా! రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా’ అంటూ చక్కటి నేపథ్య గీతం వచ్చింది.

18 pages opening

18 పేజెస్‘ సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు.

18 పేజెస్’ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. ’18 పేజెస్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *