చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ,
విడుదల తేదీ : మే 31, 2024,
నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు..,
దర్శకుడు: కృష్ణ చైతన్య,
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య,
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా,
సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి,
ఎడిటింగ్: నవీన్ నూలి,
మూవీ: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ ( Gangs of Godavari Movie Review)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చాలా హై ఎక్స్పెక్ట్సన్స్ తో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !.
కధ పరిశీలిస్తే (Story Line):
రాజముండ్రి – కొవ్వూరు మద్య గోదావరి లో వరదలు లేనప్పుడు మద్యలో మట్టి, ఇసుక తో ఏర్పడిన ప్రాంతాన్ని ఆసరాగా చేసుకొని జీవనం సాగిస్తున్న కొందరి ప్రజలను లంక గ్రామ ప్రజలని వారికి దగ్గరలో ఉన్న మేజర్ పంచాయితీ లేదా పట్టణానికి కలపబడి ఉంటాయి ఈ లంక గ్రామాలు.
అలా కొవ్వూరు గ్రామంతో కలిసిన ఒక లంక గ్రామం లో ఉంటున్న లంకల రత్నం(విశ్వక్ సేన్) చిన్నప్పుడు తల్లి తండ్రులను పోగొట్టుకొని సాధారణ జీవితం గడుపుతూ, జీవితంలో ఎదగాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే దొరసామి రాజు(గోపరాజు రమణ) బృందంలో చేరుతాడు. ఆ తరువాత రత్నాకర్ ఎమ్మెల్యే దొరసామి రాజు కి వ్యతిరేక గ్రూప్ అయిన నానాజీ(నాజర్) గ్రూపులో చేరి, దొర స్వామి రాజు మిద పోటీ చేసి ఎంఎల్ఏ అవుతాడు.
రత్నాకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత తన ప్రవర్తన కారణంగా తనతో ఉన్న స్నేహితులే శత్రువులు గా మారతారు.ఈలాంటి నాటకీయ సన్నివేశాలతో రాసుకొన్న కధలో..
లంకలరత్న టైగర్ రత్నాకర్‌గా ఎలా ఎదిగాడు ?,
ఎంఎల్ఏ రత్నాకర్ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు?,
రత్నాకర్ ఇష్టపడిన బుజ్జి (నేహా శెట్టి) ఎవరు?,
రత్నాకర్‌కు ఆమెతో ఎలాంటి సంబంధం ఏర్పడింది ?,
రత్నాకర్ తో తిరుగుతున్న రత్నమాల గతం ఏమిటి ? ,
రత్నమాలకు రత్నాకర్ కి మధ్య ఉన్న సంభంధం ఏమిటి ?,
ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడు ?,
చివరకు రత్నాకర్ అనుకొన్నది సాదించాడా ! లేదా అనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాలోని మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) ఆకట్టుకునే కధనం (స్క్రీన్‌ప్లే) తో నడిపినా, రెండవ అంకం (సెకండాఫ్) కధనం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్ లోని ఆసక్తిని సెకండ్ హాఫ్‌లో కొనసాగించ లేకపోయాడు.
కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా, రెండవ అంకం కధనం (స్క్రీన్ ప్లే) పై మరింత శ్రద్ధ పెట్టి వ్రాయ వలసింది. ఇంకా కధలోకి వెళ్తే, నేహా శెట్టి పోషించిన బుజ్జి పాత్ర ఇంకాస్త బెటర్‌గా, డీటైల్ గా చూపించి ఉండాల్సింది. అలాగే అంజలి చేసిన రత్నమాల పాత్ర బాగా కుదిరింది, ఈ రత్నమాల పాత్ర నిడివి ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది.
మెయిన్ విలన్ ఎమ్మెల్యే దొరసామి రాజు పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉండేది. స్టార్టింగ్ లో బాగానే ఉన్నా,రెండవ అంకం లో హీరో రత్నాకర్ పాత్ర ని హై రేంజ్ లోకి తీసుకు వెళ్ళిన తర్వాత విలన్ పాత్ర హీరో పాత్రతో నిలబడ లేకపోయింది.
నాజర్, సాయి కుమార్‌ల పాత్రలు చిన్నవి కావడం వలన వారి ట్యాలెంట్ వృధా అయ్యింది. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి.
దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్ లపై మరికాస్త ఫోకస్ చేయాల్సింది. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కధ చాలా పెద్ద కధ, అన్ని పాత్రలకు న్యాయం చెయ్యాలి అంటే రెండు పార్టులు గా చేసి ఉండవలసింది. లేకపోతే ఓటీటీ సిరీస్ లా నాలుగు గంటల కంటెంట్ చేసి ఉంటే, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ వెబ్ సిరీస్ లా మంచి పేరు వచ్చేది, రూరల్ రీవెంజ్ డ్రామా అయినా, ఎమోషన్స్ యునివర్సల్ కాబట్టి, అన్ని భాషల ప్రజలు ఆదరించేవారు.
ఇంత పెద్ద కధ ని రెండు గంటల సినిమా గా చెప్పవలసి రావడం, మొత్తం కధను 2 గంటల 20 నిముషాలలో పూర్తి చెయ్యాలి కాబట్టి, కొన్ని పాత్రలకు న్యాయం జరగకుండా పూర్తి ఎమోషనల్ గా లేకుండా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ గా మిగిలిపోయింది. అందుకే సినిమా రిజల్ట్ ఇలా ఉంది. హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్ గా బాగున్నా, మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) కథనం బాగున్నా, రెండవ అంకం ( సెకండాఫ్) పై మరింత డీటైల్ వర్క్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బాగా వచ్చేది. సినిమా కధ కూడా మరింత ఆసక్తికరంగా ఉండేది.
లంకల రత్నాకర్ గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశ్వక్ లుక్, ముఖం లో పలికించిన రౌద్రం చాలా బాగా సెట్య్యాయి. కాకపోతే తను గోదావరి యాసలో చెప్పే డైలాగులు కొన్ని ఇబ్బందికారంగా ఉన్నాయి. అన్నాయ్, ఆన్నాయి అనే పలకడం బాలేదు. ఇంకా సీన్స్ గురించి విశ్వక్ నటన గురించి చెప్పాలంటే, అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టాడు.
నటి అంజలి రత్నమాల పాత్ర లో బాగా నటించి ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది.
మరో నటి నేహా శెట్టి పోషించిన బుజ్జి పాత్ర కూడా బాగా సేట్ అయ్యింది. నేహా కూడా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రనే చేసింది, బాగా నటించి మెప్పించింది.
గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆది లు తమ పాత్రలకు తగ్గట్టు నటించి న్యాయం చేశారు అని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. BGM అయితే అదిరింది. ఐటం సాంగ్ కూడా మాస్ కి బాగా నచ్చుతుంది.
అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. తన క్వాలిటి విజువల్స్ తో ప్రతి సీన్ లో ఇంటెన్సిటీ క్రియేట్ చేశాడు.
నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్ లో అదిరిపోయినా, సెకండాఫ్ లో బెటర్ గా ఉండాల్సింది.
చిత్ర నిర్మాతలు ఖర్చు కి వెనకడకుండా బాగానే నిర్మించారు. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
గ్యాంగ్స్ ఆప్ గోదావరి సినిమా కధ ఒక రొటీన్ మాస్ యాక్షన్ రివేంజ్ మూవీ గానే ఉంది, కానీ విశ్వక్ సేన్ అద్భుతమైన నటన ఆహార్యం తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ఇక రత్నమాల గా చేసిన అంజలి నటన కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.
అయితే రెండవ అంకం (సెకండాఫ్) సినిమా రిజల్ట్ పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. స్క్రీన్‌ప్లే లో గ్రిప్ మిస్ అయ్యడం, హీరో పాత్ర చాలా లో నుంచి హై కి లేపిన తర్వాత ఆ స్థాయి లో స్ట్రాంగ్ విలన్ లేకపోవడం అనవసరమైన సన్నివేశాలు, కథ యొక్క మెయిన్ సీన్స్ ఫ్లో స్లో గా సాగడం ప్రేక్షకులకు నిరాశను మిగిలిస్తాయి.
ఈ వీకెండ్ లో రా-యాక్షన్ డ్రామా, విశ్వక్ నయ మాస్ అవతార్ చూడాలి అనికొనే వారు ఈ సినిమా చూడవచ్చు.