శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంతఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత యక్కలి రవీంద్ర బాబు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స్త పొందుతూ నేడు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇతని వయసు 55 సంవత్సరాలు.
మార్కాపురం లో పుట్టి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం తో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డు లు పొందారు .
తెలుగు లో నే కాకుండా తమిళ్ మలయాళం బాషాలలో కూడా చిత్రాలు నిర్మించారు ఇతను. భార్య రమాదేవి. ఇతనికి ఒక కుమార్తె ( ఆశ్రీత ) ఒక కుమారుడు ( సాయి ప్రభాస్ ).గీత రచయితగా కూడా తన ప్రతిభ చాటుకుంటూ హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ లాంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించిన సాహితి అభిలాషి ఇతను.