మూవీ: గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna):
విడుదల తేదీ : ఆగస్టు 25, 2023
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిని ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమతం, రవి వర్మ, కల్పలత, బేబీ వేద
దర్శకుడు : ప్రవీణ్ సత్తారు
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: ముకేష్ జీ
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
గాండీవధారి అర్జున మూవీ రివ్యూ:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, ప్రామిస్సింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన “గాండీవధారి అర్జున” అనే సినిమా నేడు థియేటర్ల లోకి వచ్చింది. ట్రైలర్ నుంచి ప్రేక్షకులలో ఉత్కంట క్రియేట్ చేసినా ట్రేడ్ లో అంత ఇంటరెస్ట్ లేక తక్కువ ప్రోమోసన్స్ తో ముందుకు వచ్చిన ఈ సిన్మా ఎలా ఉందో మా 18f మూవీస్ టీం సమీక్ష చదువుదామా !
కథ ని పరిశీలిస్తే (Story line):
“గాండీవధారి అర్జున” సిన్మా లో ప్రధాన పాత్ర పోషించిన అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) పారా మిలటరీ సోల్జయార్ మరియు సీక్రెట్ ఎక్స్ రా ఏజెంట్. తల్లి వైద్యం కోసం లండన్ లో ఉంటూ హైయర్ ఒఫ్ఫీస్యయల్స్ కి రక్షణ అందించే ఏజెన్సీ లో కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తూ ఉంటాడు. అయితే సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ ( నాజర్) ప్రాణానికి ముప్పు పొంచి ఉండటం తో వరుణ్ తేజ్ ను ఏజెంట్ గా తీసుకుంటారు.
నాజర్ కి ఎవరి నుండి ప్రాణ హని ఉంది?
హీరోయిన్ ఐరా (సాక్షి వైద్య) కి కథతో ఎలాంటి సంబంధం ఉంది ?
ఇంతకు ముందు అర్జున్ ఐరా ఒకరికి వకరు తెలుసా ?
హీరో అర్జున్ నాజర్ ను కాపాడగలిగారా?
అర్జున్ ఐ రా మద్య ఉన్నది ఏమిటి ?
లాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే సిన్మా థియేటర్ లో చూడాలి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
మంచి గ్లోబల్ ఇష్యూ తో కధ ను రాసుకొన్నా కధనం (స్క్రీన్ ప్లే ) విశయం లో ప్రవీణ్ సత్తారు బాగా ప్రెజెంట్ చేయడం లో విఫలం అయ్యారు. తను ఎంచుకున్న సబ్జెక్ట్ బాక్ డ్రాప్ బాగానే ఉన్నా, అంత ఎంగేజింగ్ గా సినిమా ని నిర్మించలేక పోయాడు.
మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) పడి నీమూషాలలో పాయింట్ ఏమిటి అన్నది తెలిసిపోతుంది. తర్వాత సీన్స్ లో చాలా వరకు సాగతీత సన్నివేశాలు ఉన్నాయి. చాలా అనవసర సన్నివేశాలు చూసే ఆడియెన్స్ కి బోరింగ్ ను కలిగిస్తాయి.
అర్జున సినిమాలో మంచి మెసేజ్ ను అందించడానికి కధకుడు ప్రయత్నించాడు. దానికి అనుగుణమైన గ్రిప్పింగ్ కధనం ( స్క్రీన్ ప్లే) ఇందులో లేదు.
రోషిని ప్రకాష్ సినిమాలో కీలక పాత్రను కలిగి ఉంది. అయితే సినిమాలో సబ్జెక్ట్ కి కావాల్సిన డెప్త్ ను అందించడం లో ఆ పాత్ర విఫలం అయ్యింది. దర్శకుడు వాటిని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే సిన్మా కొంచెం గ్రిప్పింగ్ గా సాగేది.
గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ అనేది ఇప్పటికీ, ఎప్పటికీ ఒక హాట్ టాపిక్. అలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేసేప్పుడు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా మంచి ట్విస్ట్ లను సెంటిమెంట్ సీన్స్ ను రాసికొని ఉండాలి. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) నుండి సస్పెన్స్, మిస్టరీ లనూ క్యారీ చేయలేదు. కొద్దిగా ఉన్నా అవి ఆకట్టుకోలేక తెలిపోయాయి.
నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
హీరో వరుణ్ తేజ్ సినిమాకి అతి పెద్ద ప్లస్. సినిమా మొత్తాన్ని తన నటన తో, యాక్షన్ లుక్స్ తో బాగా క్యారీ చేశారు. వరుణ్ తేజ్ చేసిన ఫైట్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి.
హీరోయిన్ సాక్షి వైద్య గ్లామర్ తో పాటుగా, పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసింది. కొన్ని సీన్స్ లో చాలా క్యూట్ గా గ్లామర్ గా కనిపించింది.
సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వరుణ్ తేజ్, సాక్షి వైద్య లతో పాటుగా, నాజర్ఇ, వినయ్ రాయ్త, విమలా రామన్ తో పాటు మిగిలిన పాత్రల నటీనటుల నటన వరకూ బాగుంది.
సినిమాలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కి, కల్పలత మధ్యలో ఉన్నటువంటి ఎమోషనల్ సన్నివేశాలు సినిమా ను మంచి మూడ్ లో డ్రైవ్ చేస్తాయి.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రం తో చెప్పాలి అనుకొన్న పాయింట్ ప్రపంచ ప్రజలందరికీ ఉపయోగపడేదే కానీ చెప్పే విధానం లో చాలా లోపం ఉంది. కధకుడిగా మరో మంచి ప్రయత్నం చేశాడు అని చెప్పవచ్చు. కాకపోతే సరైన కథనం కలిగి ఉండి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది.
మిక్కీ జే మేయర్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకో లేదు. ప్రేమ పాటలు మెలోడీ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ కి ఈ యాక్షన్ సినిమా మంచి అవకాశమే కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా అయినా సీన్స్ ఏలీవెట్ అవుతాయి అనుకొంటే అది లేదు.
ముకేష్ జీ అందించిన సినిమాటోగ్రఫీ ఇందులో బాగుంది. లండన్ స్ట్రీట్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే చేశారు.
ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఒకే అన్నట్టు గా ఉంది కానీ ఆహా అనేలా లేదు. మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లో కొన్ని అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉండవచ్చు.
BVSN ప్రసాద్, బాపినీడు గారు ఖర్చుకి వెనకాడకుండా ఫారన్ లొకేసన్స్ లో అద్బుతంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇయ్యడానికి ఖర్చు పెట్టి ఉంటారుఅనిపిస్తుంది . ఒవెరల్ గా సిన్మా నిర్మాణ విలువలు మాత్రమే బాగున్నాయి. సిన్మా గురించి చెప్పుకొనేది ఉండి అంటే అది ప్రొడ్యూసర్ దైర్యం.
18F మూవీస్ టీం ఒపీనియన్:
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఘోస్ట్ సినిమా తర్వాత గాండీవదారి అర్జున అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఈ రోజు మార్నింగ్ ప్రసాద్ ఐ మాక్స్ లో 8 am షో లో మీడియా తప్ప బయటి ప్రేక్షకులే లేరు. దీన్ని బట్టి చూస్తే ట్రైలర్ లైక్ చేసి వదిలేశారా ? లేక ఆడియన్స్ ఈ సిన్మా గురుంచి ముందిగానే తెలుసా అనేది చాలా పెద్ద ప్రశ్న.
ఇంక సిన్మా లో నటీనటుల పెర్ఫార్మన్స్ పరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. అనవసర సన్నివేశాలు, స్లోగా సాగే కథనం సినిమా రిసల్ట్ పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు. 150 రూపయులు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చే ఆడియెన్స్ ను ఈ సినిమా అంతగా ఆకట్టుకోక పోవచ్చు.
టాగ్ లైన్: చెత్త లో పడేసిన గాండీవం !
18FMovies రేటింగ్: 2 / 5
* కృష్ణ ప్రగడ.