Game On Movie Review & Rating: హైటెక్ విజువల్స్ తో యువతకు నచ్చే సైకాలాజికల్ థ్రిల్లర్ గేమ్

game on movie review by 18 F movies 2 e1706901174767

మూవీ: గేమ్ ఆన్ 

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, మధు, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్ తదితరులు,

దర్శకుడు : దయానంద్,

నిర్మాత: రవి కస్తూరి,

సంగీత దర్శకుడు: అభిషేక్ ఏ ఆర్,

సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్,

ఎడిటింగ్: వంశీ అట్లూరి,

  గేమ్ ఆన్ రివ్యూ (Game On Movie Review): 

Game on movie pre release event

ఈ మధ్య కాలం లో ప్రోమోసనల్ కంటెంట్ తో పాటు డీఫెరెంట్ టైటిల్ తో ఉన్న ఈ గేమ్ ఆన్ సినిమా సినీ ప్రేక్షకులలో ఓక బజ్ అయితే క్రియేట్ చేసింది.

రిలీజ్ కి ముందు పోసిటివ్ బజ్ తెచ్చుకొన్న ఈ గేమ్ ఆన్ మూవీలో గీతానంద్ హీరోగా నటించగా నేహా సోలంకి హీరోయిన్ గా నటించారు. హీరో గీత్ ఆనంద్  తమ్ముడూ దయానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మంచి అంచనాల మద్య  ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క సమీక్ష ను మా 18 F మూవీస్ టీం  ఇచ్చిన రివ్యూ ద్వారా  ఇప్పుడు చదివి తెలుసుకొందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

game on movie review by 18 F movies 3

గౌతం సిద్దార్థ (గీతానంద్) ఏదో పోగొట్టుకొన్న వాడిలా డల్ గా ఉంటూ, తను పని చేస్తున్న గేమింగ్ సాఫ్ట్వేర్ ఆఫీసు లో ని తన ఫ్రెండ్స్  మరియు గర్ల్ ఫ్రెండ్ దృష్టిలో లూజర్ గా మిగిలిపోతాడు. తన బాస్ ఇచ్చిన టాస్క్ లు కూడా ఫినిష్ చేయలేక ప్రతిరోజూ కోలీగ్స్ అందరిముందు తిట్లు తింటూ ఉంటాడు. ఓక సంధర్భం లో బాస్ ఉద్యోగం నుండి తీసివేయడం తో పాటు, తన గర్ల్ ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇవ్వడం తో  సిద్ధూ సూసైడ్ చేసుకోవాలని భావిస్తాడు.

అదే సమయంలో సిద్దూ కి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ కాల్ రావడం, ఆ కాల్ ద్వారా కొన్ని గేమింగ్ ఫజిల్స్ యిస్తూ విన్ అయిన ప్రతి సారీ లక్షలలో డబ్బులు అకౌంటు లో పడుతుండడం తో అతడి జీవితం మారిపోతుంది. ఇలా జరిగిపోతున్న టైమ్ లో  ఇప్పుడు రియల్ గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాము, అందులో కొన్ని బయంకరమైన రూల్స్ కూడా ఉంటాయని గేమింగ్ వాళ్ళు చెప్తారు.

సిద్ధార్థ్ రియల్ గేమర్ గా మరే టైమ్ లో తార (నేహా సోలంకి) అతడి లైఫ్లోకి వచ్చి సహాయం చేస్తుంది. కొన్ని సంఘటనల తర్వాత సిద్దు కూడా తార ని ప్రేమిస్తాడు. తను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది.

కొన్ని అనుకోని సంఘటనల తర్వాత

రియల్ గేమ్ లో  సిద్దార్థ విజయం సాదించాడా ? 

అసలు గౌతం సిద్ధార్థ్ ఎవరు ? అతని గతం ఏమిటి ?

తార ఒరిజినల్ గా ఎవరు ? సిద్దు ని నిజంగానే లవ్ చేస్తుందా ? 

తార సిద్ధూ  లైఫ్ ని ఏ విధంగా మార్చింది ?

ట్రైలర్ లో చూసినట్టు సైకాట్రిక్ డాక్టర్ రియల్ గేమ్ ఎందుకు అదిస్తున్నాడు ?

మధుబాల ఎవరు ? సిద్ధూ కి ఆమెకి ఉన్న సంభంధం ఏమిటి ? 

game on movie review by 18 F movies

వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా అనిపించి జవాబులు తెలుసుకోవాలి అనుకొంటే ఎంటనే గేమ్ ఆన్ సినిమా దియేటర్ కి వెళ్ళి చూసేయండి. ఇంకా వివరాలు కావాలంటే మా మొత్తం సమీక్ష చదివి మీరు కూడా ఓక అవగాహనతో కామెంట్స్ చేయండి.

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ గేమ్ ఆన్ చూడడము అనుకొనే ప్రతి ప్రేక్షకుడు, ప్రేక్షకురాలు కూడా కొరియన్ షో స్క్విడ్ గేమ్ ని గుర్తు చేస్తుంది. అలాగే మన ఇండియన్ టివి షోలలో మరి ముఖ్యంగా మన యాంకర్ సుమ టివి లో ఆడించిన అన్ని గేమ్స్ లఅనే ఉంటుంది అనుకొనే వారికి ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇలాంటి సై కాలజీకల్ థ్రిల్లర్ మూవీస్ కి కధ కంటే కధనం ( స్క్రీన్ ప్లే) చాలా ముఖ్యం.  చాలా ఎక్స్ఆర్డిడినారీ స్క్రీన్ రైటింగ్ ఉంటే తప్ప గేమింగ్ ఇస్తాపడే ప్రేక్షకులను మెప్పించడం కష్టం.  కానీ ఈ గేమ్ ఆన్ సినిమా కి మెదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) లో హీరో పెర్ఫార్మన్స్ తప్ప  కధనం రెగ్యులర్ గయా సాగుతూ పెద్దగా ఆకట్టుకోదు.

గేమ్ ఆన్ చిత్రం లో రెండు మూడు ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కూడా అవి స్క్రీన్ మీద అంతగా ఆసక్తికరంగా లేకపోవడంతో  మైనస్ అని చెప్పవచ్చు. రెండవ అంకం (సెకండ్ ఆఫ్ ) మరియు క్లైమాక్స్ఎపిసోడ్స్ బాగున్నాయి కాబట్టి జీరో ఎక్స్పెక్ట్సన్స్ తో వెళ్ళే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నటి నటుల నటన, టెక్నికల్ క్వాలిటి బాగున్నా , స్క్రిప్ట్ లో ఇప్పటి వరకూ చూడని గేమ్ ట్విస్టులులతో కొత్త  కధనం రాసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

game on movie review by 18 F movies

దర్శకుడు దయానంద్ మూవీని మంచి స్టైలిష్ థ్రిల్లర్ గా తీయాలని భావించారు కానీ అందుకోసం మరింత కష్టపడాల్సింది. అలానే కధనం (స్క్రీన్ – ప్లే ) లో అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ ల విషయంలో కూడా రేసి స్క్రీన్ ప్లే తో  ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా ఎక్స్పెరియన్స్ డైరెక్టర్ లా మూవీ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.

గీతానంద్ ని హీరోగా కంటే మంచి నటుడు గా గుర్తుపెట్టుకొనే సినిమా ఈ గేమ్ ఆన్ మరియు ఈ చిత్రానికి  గీత్ నే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో, మదర్ తో ఎమోషనల్ సీన్స్ లో, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో గీత్ యాక్టింగ్ ఎంతో బాగుంది. స్టార్టింగ్ లో యువకుడిగా, జాబ్ లో లూజర్ గా, ఆ తరువాత స్ట్రాంగ్ గెమర్ గా మారడం లో గీత్ చూపించిన నటన, పడిన తపన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గీత్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగుంది.

హీరోయిన్ నేహా సోలంకి తన పాత్ర యొక్క పరిధి మేరకు అందరినీ అలరించారు. స్మోకింగ్ మరియు కొన్ని రొమాంటిక్ సీన్స్ లో అయితే హద్దులు లేకుండా నటించింది అని చెప్పవచ్చు. 90ML మూవీ లో చేసిన నటన 90ML అంత కిక్ అనుకుంటే ఈ గేమ్ ఆన్ లో మాత్రం ఫుల్ బాటిల్ అంత కిక్ లో చేసింది. కొన్ని సీన్స్ లో అయితే హీరో గీత్ ని డామినేట్ చేస్తూ నటించింది. తన పాత్ర కు కూడా డుయల్ సేడ్స ఉండటం వలన కూడా నటించడానికి స్కోప్ దొరికింది.

game on movie review by 18 F movies 4

నటుడు ఆదిత్య మీనన్, మరొక సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ ఇద్దరూ కూడా తమ పాత్రల పరిడి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆదిత్య మీనన్ నటన డైలాగ్స్ మాడ్యులేసన్ బాగా కుదిరాయి అని చెప్పవచ్చు.

మరో సీనియర్ నటి మధుబాల కూడా ఇంతకు ముందు ఎప్పుడు చేయాలి పాత్రలో నటించి మెప్పించారు. తన పాత్ర పరిది చిన్నదే అయినా ఉన్నంతలో ఇంపాక్ట్ ఫుల్ గా నటించయిచ్చారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చాలా యాక్షన్ సీన్స్ కి ఎమోషనల్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే ప్రాణం.  రాప్ సాంగ్ మరియు మెలోడీ సాంగ్ కూడా బాగున్నాయి. ఇక ఈ మధ్య కాలం లో వచ్చిన  సినిమాలతో పోలిస్తే  గేమ్ ఆన్ మూవీ విజువల్స్ ది బెస్ట్ అని చెప్పాలి.

game on movie review by 18 F movies 5

అరవింద విశ్వనాథన్ (Poxy ) సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా వరకూ నైట్ ఎఫెక్ట్ షాట్స్ కూడా నీట్ గా క్లారిటీగా ఉన్నాయి.

వంశీ అట్లూరి యొక్క ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ ఇలాంటి సైకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్స్ కి ఫాస్ట్ కట్స్ ఉంటే డీఫెరెంట్ మూడ్ క్రియేట్ అవుతుంది. మ్యూజిక్, ఫోటోగ్రఫీ తో పోలిస్తే ఎడిటింగ్ కొంచెం డల్ గానే ఉంది అని చేపవచ్చు.

రవి కస్తూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. గేమ్ ఆన్ మూవీ మేకర్స్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా మనకు స్క్రీన్ పై కనపడుతుంది. హీరో మార్కెట్ వాల్యూ ని దృష్టి లో పెట్టుకోకుండా కంటెంట్ కి అవశ్యమైన టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చుపెట్టి మూవీ ని చాలా రీచ్ గా నిర్మించారు.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

దయానంద దర్శకత్వపు గేమ్ లో గీతానంద్ నటిస్తూ ఆడిన  గేమ్ ఆన్ మూవీ ఓక సైకాలాజికల్  యాక్షన్ థ్రిల్లర్ గా గేమింగ్ మరియు యాక్షన్ కోరుకొనే యువతను ముఖ్యంగా స్తుండేట్స్ ని ఆకట్టుకొంటుంది. మొదటి అంకం కొంచెం డల్ గా సాగినా రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ తో  పర్వాలేదనిపించే లా సాగుతుంది.

ముఖ్యంగా గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాలల పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ప్రధాన బలం. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో మదుబాల గీత్ ల నటన మరింతగా ఆకట్టుకుంటుంది. గేమ్ సాగే విధానం లో కొన్ని ట్విస్టులు అంతగా  ఆకట్టుకో లేకుండా రెగ్యులర్ సినిమా సీన్స్ లానే సాదాసీదాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ BGM + యాక్షన్ ఎపిసోడ్స్ గేమ్ ఆన్ సినిమా కి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

స్టూడెంట్స్, సింగిల్స్ ఫ్రెండ్స్ తో కలిసి ఈ వీక్ ఎండ్ లేదా వీక్ డేస్ లో  దియేటర్ నే చూడదగ్గ సినిమా.  ఎందుకంటే కొన్ని ఎఫ్ఫెక్ట్స్ దియేటర్ ఎక్స్పెరియన్స్ లోనే బాగుంటాయి.

Game on movie pre release event 4

చివరి మాట:  స్టోరీ ! న్యూ జెన్ స్టూడెంట్స్ కి నచ్చే గేమ్ !

18F RATING: 2.75/5

   * కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *