Gam Gam Ganesha second single will be releasing on: ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” సినిమా నుంచి సెకండ్ సింగిల్  రిలీజ్ ఎప్పుడంటే !

Gam Gam Ganesha second single will be releasing on e1714735398876

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

రేపు మద్యాహ్నం 12.06 నిమిషాలకు “గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ ప్రగతి శ్రీవాస్తవ మద్య రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ పాట రూపొందించారు.

ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీగా “గం..గం..గణేశా” పై అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ, ఆర్ట్: కిరణ్ మామిడి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం – చేతన్ భరద్వాజ్, బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్, కొరియోగ్రఫీ: పొలాకి విజయ్, కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *