Gam Gam Ganesha Movie Review & Rating: చిన్నరౌడీ గణేశా తో మాస్ హీరో గా స్థిర పడతాడా ?

GGG Movie review by 18fms e1717306270777

చిత్రం: గం గం గణేశా !, 

విడుదల తేదీ : మే 31, 2024,

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.,

దర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టి,

నిర్మాతలు : కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి,

సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్,

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది,

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,

మూవీ: గం గం గణేశా రివ్యూ  (Gam Gam Ganesha Movie Review) 

ఛోటా రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా ‘గం గం గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా గత శుక్రవారం  రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో  మా 18Fమూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !

IMG 20240601 WA0168

కధ పరిశీలిస్తే (Story Line): 

గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ అనాధ. తన ఫ్రెండ్ (జబర్దస్త్ ఇమాన్యూయల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అటు శ్రుతి (నయన్ సారిక)తో బాగా డీప్ గా ప్రేమలో ఉంటాడు. ఐతే, శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్ కి హ్యాండ్ ఇస్తోంది.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏదైనా పెద్దగా చేసి లైఫ్ లో సెట్ అవ్వాలని, గణేశ్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు.

ఆ డైమండ్ దొంగిలించడం కోసం గణేశ్ ఏం చేశాడు ?,

అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?,

మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ?,

అసలు ఆ వంద కోట్లు ఎవరవి ? ఎందుకు ముంబయి నుండి కర్నూల్ వస్తున్నాయి ?,

ఇంతకీ.. గణేశ్ లైఫ్ లోకి నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ) ఎలా వచ్చింది ?,

చివరకు గణేశ్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది?

గణేష్ కి విలువైన డైమండ్ దొరికిందా ? లేదా ?

అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే వెంటనే వెళ్ళి మీ దగ్గరలోని థియేటర్ లో గం గం గణేశా ! సినిమా చూసేయండి .

ggg success meet

కధనం పరిశీలిస్తే (Screen – Play):

‘గం గం గణేశా’ సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ఆ స్టోరీ లైన్ కి లిచ్చిన ట్రీట్మెంట్ బాగున్నా, మొత్తం సినిమా గా చూస్తే పెద్దగా కథ లేకపోవడం కథనం ( స్క్రీన్ – ప్లే) కూడా రెగ్యూలర్ ఫార్మెట్ లోనే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి.

అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. గణేష్ విగ్రహం లో డబ్బులు పెట్టేటప్పుడు, పూర్తిగా తయారైన విగ్రహంలోకి వేనకనుండి పెట్టి, తీసే టప్పుడు మొత్తం విగ్రహం కరిగించాలి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

దీనికితోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో, మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు చాలా మంది ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.

అయితే దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించింది.  అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. కథ లో ఇంకొన్ని ఎలిమెంట్స్ జోడించి,  కథనం (స్క్రీన్ – ప్లే) ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి, తర్వాత కధనం లో అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు అనిపిస్తుంది.

gam gam ganesha success meet

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా,కథ – కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో వచ్చిన కిష్కింద కాండ సినిమా థీమ్ లాగే ఈ గం గం గణేశా కూడా సాగినట్టు అనిపించింది.

‘‘గం గం గణేశా’’ సినిమా మొత్తం  కామెడీ టోన్ తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్, ట్విస్ట్ లు,ఎమోషన్స్ వంటి సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని మలచిన విధానం తో దర్శకుడు మంచి మార్కులే సంపాదించాడు.

హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగతి శ్రీవాస్తవ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి.

మరో హీరోయిన్ పాత్రలో కనిపించిన నయన్ సారిక నటన కూడా ఆకట్టుకుంది.

ముఖ్యంగా వెన్నెల కిషోర్ పోషించిన ఆర్గాన్ డేవిడ్ పాత్ర మాత్రం సినిమా కె హై లైట్ అని చెప్పవచ్చు. ఆ పాత్ర లేకపోతే సినిమా నే లేదు అనే విధంగా కుదిరింది.

జబర్దస్త్ ఇమాన్యూయల్ కామెడీ కూడా పర్వాలేదు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

IMG 20240528 WA0237

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఆక్కడక్కడ కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది.

ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాగుంది. లైవ్ లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా, సినిమాటోగ్రాఫర్  ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది.

ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది.

ఈ చిత్ర నిర్మాతలు కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

gam gam ganesha pre release event highlights 5

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఆనంద్  దేవరకొండ నటించిన ఈ ‘‘గం గం గణేశా” సిన్మా లో  క్రైమ్ కామెడీ తో పాటు సస్పెన్స్ డ్రామాగా కొన్ని సీన్స్ లో  ఆకట్టుకున్నా, రెండు గంటల ఇరవై నిముషాలు పూర్తి సినిమా గా మాత్రం మెప్పించలేకపోయింది.

అయితే, ఆనంద్ దేవరకొండ చేసిన నటన,  కథలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు క్లైమాక్స్ బాగున్నా, కథ – కథనాలు స్లోగా సాగడం, రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కి పిల్లలు, హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులు కనెక్ట్ అయినా, సామాన్య ప్రేక్షకులు మాత్రం సినిమా కి అంతగా  కనెక్ట్ కారు అనిపఇస్తుంది. అలాగని పూర్తిగా పక్కన పెట్టె సినిమా కాదు, ఫ్యామిలీ అందరితో వీక్ ఎండ్ థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేసేలా ఉండతుంది.

చివరి మాట: గణేష్ మెప్పించాడు !

18F RATING: 2.75  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *