Gam Gam Ganesha Lyrical song: ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” సినిమాలోని ‘బృందావనివే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన రశ్మిక మందన్న !

IMG 20231003 WA0129 e1696444162613

 

“బేబి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాపీగా ఉన్న ఆనంద్ దేవరకొండ…అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ కామెడీ జానర్ తో “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

IMG 20231003 WA0053

“గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న రిలీజ్ చేసింది. ఆనంద్ గత సూపర్ హిట్ ఫిల్మ్ “బేబి”లోని ప్రేమిస్తున్నా సాంగ్ కూడా రశ్మికనే విడుదల చేసింది. ఆ సాంగ్ కంటే బృందావనివే పాట బిగ్ హిట్ కావాలని రశ్మిక బెస్ట్ విశెస్ తెలియజేసింది. తమ సినిమాలోని పాట రిలీజ్ చేసిన రశ్మికకు థాంక్స్ చెప్పారు హీరో ఆనంద్ దేవరకొండ. బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ బృందావనివే మీకు నచ్చుతుందని ఆయన ట్వీట్ చేశారు.

IMG 20231004 WA0116

చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బృందావనివే పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించారు. సిధ్ శ్రీరామ్ తో కలిసి చేతన్ భరద్వాజ్ ఈ పాట పాడారు. *’బృందావనివే యవ్వనివే నీవే, నా మనసే నీ వశమే రా, ప్రేయసివే ఊర్వశివే నీవే, ఆరాధనమైనావే…’* అంటూ మంచి లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ మెలొడీగా ఆకట్టుకుంటోందీ పాట. “గం..గం..గణేశా” త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

IMG 20231001 WA0161

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్,సత్యం రాజేష్,రాజ్ అర్జున్ తదితరులు.

 

సాంకేతిక నిపుణులు:

పీఆర్వో – జీఎస్ కే మీడియా

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం – చేతన్ భరద్వాజ్

బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *