Johar Gaddaranna: ప్రజాగాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం “ఉక్కు సత్యాగ్రహం’

gaddar last movie 6 e1691346918561

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3న ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయగా కోలుకున్నారు.

gaddar ఉప్పు సత్యాగ్రహం

అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడుతుండడంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మా భూమి’ సినిమాలో ‘బండి వెనక బండికట్టి’ పాటతో వెండితెరపై కనిపించారు.

gaddar last movie 3

సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో  రూపొందిస్తున్న ఈ చిత్రమిడి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాసారు. గద్దర్ మరణవార్త తెల్సుకున్న ఈ చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు.

gaddar last movie 1

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌గారు చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ఇదే! ఇటీవల రీ రికార్డింగ్‌ పనుల్లో పాల్గొన్నారు. ఆయన మరణించడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా టీమ్‌ అందరి తరఫున కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

gaddar last movie 4

జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్నా ఈ సినిమాలో  పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయం అవుతోంది. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్‌, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్‌, కేయస్‌ఎన్‌ రావ్‌, మీరా, పల్నాడు  శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావ్‌, బాబాన్న తదితరు?ని కీలక పాత్రలు పోషించారు.

gaddar last movie

 అప్పట్లో స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం, ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్టీల్‌ ప్లాంట్‌  యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, నిర్వాసితులు ఈ చిత్రంలో నటించటం ఒక విశేషం.

రియాలిటీకి దగ్గరగా యువతరాన్ని ఆలోచింప చేేస విధంగా ఈ చిత్రం ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, సత్యారెడ్డి, మజ్జి దేవిశ్రీ చక్కని పాటలు రాశారు. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. రీ-రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి.

gaddar

సాంకేతిక నిపుణులు:
కథ,స్క్రీన్, ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం సత్యారెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ :-శ్రీ  కోటి, ఎడిటర్: మేనగ శ్రీను, సినిమాటోగ్రఫీ: వెంకట్ చక్రి, కోరియో గ్రఫీ :నందు, నాగరాజు, కో డైరెక్టర్ పవన్ బాబు  రంగనాధ్, సమర్పణ సతీష్ రెడ్డి, శ్రీవేమల సహ నిర్మాతలు శంకర్ రెడ్డి, కుర్రి నారాయణరెడ్డి, పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *