GADAR2 HERO SUNNY DOEL IN HYD:  బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తారా సింగ్.

GADAR2 Sunny 4 e1692272415579

ఇరవై రెండేళ్ల క్రితం గదర్ చిత్రం తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సన్నీడియోల్..ఇప్పుడు దీని సీక్వెల్ తోను బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన గదర్2 ఆగస్టు 11న విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

విడుదల అయిన ఐదు రోజుల్లోనే రూ. 229 కోట్ల కలెక్షన్స్‌కు చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. గత పదేళ్ల కాలంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి తారా సింగ్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న సన్నీడియోల్.

GADAR2 Sunny

సన్నీడియోల్ మూవీ ప్రమోషన్‌ కోసం బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఏఎంబి సినిమాస్ లో జరిగిన ఈవెంట్లో టాలీవుడ్ మీడియాతో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి సన్నీడియోల్ ధన్యవాదాలు తెలియజేశారు.

GADAR2 Sunny Doel

ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించగ.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *