Gaami Movie Telugu Review & Rating: వెండి తెర మీద అద్బుత ప్రయోగం ఈ గామి చిత్రం !

gaami Review and Rating by 18fms e1710053117694

చిత్రం: గామి 

విడుదల తేదీ: మార్చి 08, 2024

నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్ మరియు ఇతరులు

దర్శకుడు: విద్యాధర్ కాగిత

నిర్మాత: కార్తీక్ శబరీష్ మరియు చాలా మంది క్రౌడ్ ఫండర్లు

సంగీత దర్శకులు: నరేష్

సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్ రెడ్డి సి.హెచ్

ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్

మూవీ: గామి రివ్యూ  ( Gaami Movie Review) 

గామి అనే చిత్ర రాజాం పోస్టర్స్, ప్రోమోసనల్ కంటెంట్ తో  టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ శుక్ర వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చి అందరినీ ఆకర్షించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే అది చాలా డీఫెరెంట్ సినిమా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎక్సయిట్ అవుతారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డెబ్యూ  దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ గామి చిత్రం ట్రైలర్ తో క్రియేట్ చేసిన బజ్ తెలుగు సినీ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా అనేది మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !.

Gaami Review and Rating by 18fms success meet 1

కధ పరిశీలిస్తే (Story Line): 

మానవ స్పర్శని తట్టుకోలేని శంకర్ (విశ్వక్ సేన్) అనే ఓ అఘోర, తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఇమడ లేక మానవాళికి దూరంగా కొందరు అఘోరలతో కలిసి జీవిస్తుంటాడు.  అయితే  స్పర్శ సమస్య ఉన్న శంకర్ వలన తమకు ఇబ్బందులు వస్తున్నాయి అని అదే ఆశ్రమం లో ఉన్న కొందరు అఘోరా లు శంకర్ ను వెల్లగొడతారు.

ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే హిమాలయాలలోని ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి చేరుకోవడానికి  పయణమైన తన ప్రయాణంలో తోడుగా దారితెలిసిన బాటసారిగా డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి) తోడవుతుంది.

మరో పక్క శంకర్ ని చిన్న పిల్ల, నడివయస్సు అబ్బాయి బాధలు విజువల్స్ గా వెంటాడుతూ ఉంటాయి. ఇందులో కనిపించే అభినయ(దుర్గ), అలాగే ఇండియా చైనా బోర్డర్ లో మానవ ఆర్గాన్ ప్రయోగ శాళలో  జరిగే  ప్రయోగాలు (CT – 333 మొహమ్మద్ షమద్) తనకు కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంటాయి.

ఇవి శంకర్ కు ఎందుకు కనిపిస్తున్నాయి ?

శంకర్ తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా?

అసలు శంకర్ ఎవరు ? తన గతం ఏమిటి?

ఎందుకు అఘోరా గా మారాడు ? 

డాక్టర్ జాహ్నవి ఎవరు ? ఆమెకు మాలిపత్రాలకు ఉన్న సంబంధం ఏమిటి?

CT-333 ల్యాబ్ ఎవరు నడుపుతున్నారు ? 

CT-333 ల్యాబ్ లో ఏమేమి ప్రయోగాలు జరుగుతున్నాయి? 

ట్రైలర్ లో చూపించిన దేవదాసీ (దుర్గ) ఎవరు ? 

దుర్గ కూతురికి – శంకర్ కి ఏమైనా సంబంధం ఉందా ? 

డాక్టర్ జాహ్నవి అనుకొన్న లక్ష్యం చేరిందా ?

చివరకు శంకర్ కి ఉన్న సమస్యకి పరిస్కారం దొరికిందా ? 

అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ చిత్రంని వెండితెరపై చూడాల్సిందే. ఇలాంటి అద్భుత ప్రయోగ చిత్రాలను బిగ్ స్క్రీన్ మీద చూసే అనుభూతి అద్భుతంగా ఉంటుంది.  మిస్ కాకుండా తప్పకుండా దియేటర్స్ లో మాత్రమే చూడవలసిన చిత్రం ఈ గామి.

Gaami Review and Rating by 18fms success meet

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ గామి చిత్రం మెయిన్ థీమ్ పాయింట్ కొత్తగా డీసెంట్ గానే ఉంది కానీ సామాన్య ప్రేక్షకులను  పూర్తి స్థాయిలో సినిమా ఎగ్జైటింగ్ గా అనిపించదు. అలాగే ట్రైలర్ లోని విజువల్స్ అవీ చూసి చాలా మంది ఎగ్జైట్ అయ్యి ఉండొచ్చు అయితే ఇవి ఉన్నాయి కానీ వీటి విషయంలో కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే మంచిది. అలాగే పలు సీన్స్ లో లాజిక్స్ కూడా బాగా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

వీటితో పాటుగా హై మూమెంట్స్ ని కూడా ఇంకాస్త దట్టించి ఉంటే బాగుండేది. అలాగే సెకండాఫ్ లో కొన్ని చోట్ల నరేషన్ మనం ఆల్రెడీ ఊహించే రేంజ్ లోనే అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ నుంచి కూడా కొంచెం స్లో గానే కథనం సాగుతుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మరికొన్ని సీన్స్ ని డిటైలింగ్ గా ప్రెజెంట్ చేస్తే చూసే ఆడియెన్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా అనిపిస్తుంది.

gaami Review and Rating by 18fms 2

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

నూతన  దర్శకుడు విద్యాధర్ కాగిత  దర్శక ప్రతిభ గురించి చెప్పాలి అంటే తను ఓక కొత్త పాయింట్ ని తీసుకొని దానిని ఈ రేంజ్ విజువల్స్ తో అందులోను చాలా తక్కువ బడ్జెట్ వూసుయల్ వండర్ గా గామి మూవీ ని ప్రెజెంట్ చేయడం హర్షణీయం. అలాగే శంకర్ ( విశ్వక్ సేన్)  పాత్రను తాను డిజైన్ చేసిన విధానం మరియు ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా తను చెప్పాలి అనుకొన్న కధ – కధనం వరకే పరిమితం అయ్యి సినిమా గా  తీసి ఆడియెన్స్ ని మెప్పించగలగడం విశేషం.

అయితే తాను కొన్ని అంశాల్లో మాత్రం లాజిక్ వదిలి విజువల్ మ్యాజిక్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం చూస్తే కొన్ని సీన్స్ లో  కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) అంతా స్లో కథనం తో కధ నడిపించాడు.  రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో కూడా కొన్ని సీన్స్ ఇంకా గ్రిప్పింగ్ గా చేసి ఉంటే సినిమా సామాన్యులకు కూడా అర్దం అయ్యి మంచి రిజల్ట్ వచ్చేది. ఇలాంటి చిన్న విశయాలు మినహా డెబ్యూ డైరెక్టర్ అయిన విద్యాధర్ హార్డ్ వర్క్ ఈ గామి చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది.

హీరో విశ్వక్ సేన్ నుంచి మరో సాలిడ్ ప్రయత్నం అని చెప్పాలి. ఈ చిత్రంతో తన నుంచి మరిన్ని ప్రామిసింగ్ సబ్జెక్ట్ లు ఆశించవచ్చు. అయితే ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కూడా నీట్ గా ఉందని చెప్పాలి. అఘోర పాత్రలో తనని ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేని వ్యక్తిగా తాను తన రోల్ కి పూర్తి న్యాయం చేసాడు. ఇప్పటి వరకూ విశ్వక్ కి ఓక వర్గం ఫాన్స్ మాత్రమే ఉన్నారు. ఈ గామి సినిమా నుండి అన్ని వర్గాల ప్రేక్షకులు విశ్వక్ సేన్ ఫాన్స్ అవ్వడం గ్యారంటీ.

ఫీమేల్ లీడ్ లో నటించిన చాందిని చౌదరి కూడా తన నటన తో ఆకట్టుకున్నది. హీరో విశ్వక్ సేన్ కి సపోర్టింగ్ రోల్ లో  కనిపించినా  తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవడమే కాకుండా కొన్ని కష్టతరమైన సన్నివేశాల్ని చేయడం మెచ్చుకొని తీరాలి.

కలర్ ఫోటో, ఈ గామి సినిమాలతో చాందిని కూడా మంచి డిఫిరెంట్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది అని చెప్పవచ్చు.

అలాగే నటి అభినయ మరోసారి తన రోల్ లో షైన్ అయ్యారని చెప్పాలి. ఆమెపై కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. తన సహజ నటనతో దేవదాసీ పాత్ర కు పూర్తి న్యాయం చేసింది.

ఇక వీరితో పాటుగా బాల్య నటులు ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇంకా సినిమాలో బాగా ఎగ్జైట్ చేసే అంశం ఆ విజువల్స్ మరియు నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు.

gaami Review and Rating by 18fms vishwak

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు కోసం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. క్రౌడ్ ఫండింగ్ అంటూ చేసిన ఈ హానెస్ట్ అటెంప్ట్ చాలా తక్కువ బడ్జెట్ లో చూపించిన అవుట్ పుట్ మాత్రం ఊహించనిది అని చెప్పవచ్చు. ఈ విషయంలో టెక్నికల్ టీం అంతటికీ క్రెడిట్ వెళుతుంది.

నరేష్ కుమారన్ ఇచ్చిన సంగీతం ఈ గామి సినిమా కి ఆయువుపట్టు. ముఖ్యంగా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. డార్క్ ఫ్రీజీడ్ హిమాలయాల మధ్యలో మనుషులమీద ప్రయోగాలు వంటి సీన్స్ కి BGM అద్బుతంగా సెట్ అయ్యింది.

DoP విశ్వనాథ్ రెడ్డి, Co – DoP రాంపీ  అందించిన  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అగోరాల ఎలివేశన్, CT-333 ప్రయోగాల లాబ్ (CT-333 ఎపిసోడ్ మొత్తం) విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు. VFX షాట్స్ నా ఒరిజినల్ షాట్స్ నా అనే డీఫెరెన్స్ లేకుండా అద్భుతంగా డిజైన్ చేసిన DoP కి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు.  తక్కువ బడ్జెట్ లోనే తీసినా ఎలాంటి ప్రయోగాత్మక కినేయంలు చెయ్యాలి అంటే దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్ గూడా ఎంతో హోమ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి హై స్టాండర్డ్ విజువల్స్ రావు.

 ఇక రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని షార్ప్ కట్స్ వలన సామాన్య సినీ వీక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో తెలియదు కానీ రెగ్యులర్ హాలీవుడ్ మూవీస్ చూసే వారికి మాత్రం ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అద్భుతం అనిపఇస్తుంది.

నిర్మాత కార్తీక్ శబరీష్ ముందుండి చాలా మంది హవుత్సహిక సినీ లవర్స్ నుండి ఫండ్ (క్రౌడ్ ఫండింగ్ ) కలెక్ట్ చేసి మంచి ప్రయత్నం చేసినట్టు చెప్పవచ్చు.  గామి సినిమా నిర్మాణ విలువులు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

gaami review by 18 fms

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

“గామి” చిత్రం ఖచ్చితంగా విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి చిత్రం గా నిలిస్తుంది. విశ్వక్ నుండి ఈ గామి ప్రయత్నం ఓక   యూనిక్ అండ్ డేరింగ్ అటెంప్ట్ అని చెప్పాలి.  తాను సహా ఇతర మెయిన్ తారాగణం కూడా సినిమాలో మెప్పిస్తారు.

గామి సినిమాలో టెక్నికల్ వాల్యూస్, మెయిన్ పాయింట్ పట్టుకొని నడిచే కథనం (స్క్రీన్ – ప్లే) కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతుంది. ఓవరాల్ గా కొత్త దర్శకుడు అయినా విద్యాధర్ స్క్రీన్ – ప్లే అయితే ఇంటర్నేషనల్ మూవీ స్టాండర్డ్ లో ఉంది.

అయితే కొన్ని సీన్స్  స్లో నరేషన్, విజువల్స్ కోసం సీన్స్ డిజైన్ చేయడం, మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) మొత్తం కధ లేకుండా టెక్నికల్ గా డ్రైవ్ చేయడం వలన సామాన్య సినీ ప్రేక్షకులకు ఎంత మేరకు అర్దం అవుతుందో చూడాలి.

ఒవెరల్ గా కొన్ని లాజిక్స్ ని పక్కన పెడితే దర్శకుడు చెప్పాలనుకున్న ప్రయత్నం ఈ వారంతానికి థియేటర్స్ లో డీసెంట్ ట్రీట్ ని అందిస్తుంది. ముఖ్యంగా డీఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్, హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారికి అయితే ఈ గామి సినిమా ఓక అద్భుత దృశ్య కావ్యం అని చెప్పవచ్చు.

చివరి మాట: గామి చిత్ర వీక్షణ వెండి తెర అద్బుత ఆవిస్కారణ !

18F RATING: 3.25 / 5

   * కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *