Gaami Movie Director Special Interview : ‘గామి’ మూవీ డైరెక్టర్ విద్యాధర్ స్పెషల్ ఇంటర్వ్యూ! 

IMG 20240305 WA0171 e1709640927149

  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి‘. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.

ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత మా      18F మూవీస్ విలేకరితో సమావేశంలో ‘గామి’ విశేషాలని పంచుకున్నారు.

IMG 20240305 WA0150

‘గామి’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? విశ్వక్ ఎలా వచ్చారు ? 

నిజంగా జరిగిన ఓ సంఘటన నాకు చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి.

మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే లోచనతో మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమానిస్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు.

తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలా పెద్ద అలోచించారు.

IMG 20240305 WA0063

గామికి ఐదేళ్ళు పట్టింది కదా.. ఇన్నేళ్ళ ప్రయాణంలో ఏం నేర్చుకున్నారు ? 

మాకు ఒకటి కావాలి. దాని కోసం ఎంతవరకైనా చేసుకుంటూ వెళ్లాం. అవతార్ ని కూడా పదేళ్ళు తీస్తారు. దాన్ని డీలే అని చెప్పం కదా. అది చేయాలంటే ఒక సమయం పడుతుంది. కొత్తగా చేస్తున్నామని భావించాం. కాబట్టి సమయం పట్టిందనే భావన రాలేదు. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి.. విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించామని భావిస్తున్నాం.

ట్రైలర్ లో చాలా పాత్రలు కనిపించాయి .. ఇది హైపర్ లింక్ స్టొరీనా ? 

ఆ లింక్ గురించి ఇప్పుడే చెప్పడం సబబు కాదు. అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే ట్రైలర్ చూపినట్లుగానే ఆ పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి. సమద్, హారిక, చాందిని వీరందరినీ ఆడియన్స్ చేసే తీసుకున్నాం.

ఇలాంటి ట్రావెలింగ్ కథని ప్రేక్షకులకు ఆసక్తిగా చెప్పడానికి ఎలాంటి ఎలిమెంట్స్ ని పొందుపరిచారు? 

IMG 20240305 WA0030

‘గామి’ సినిమా అంతా ఎంగేజింగ్ గా వుండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో వుంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది. ఇందులో డ్రామా చాలా అద్భుతంగా వుంటుంది. అది ప్రేక్షకులని సినిమాలో లీనం చేస్తుంది.

గామి టైటిల్ గురించి ? 

గామి అంటే సీకర్. గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం వుంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది.

శంకర్ పాత్రకు ఏదైనా స్ఫూర్తి ఉందా ? 

కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా కల్పించిన పాత్ర అది. ఫిక్షనల్ క్యారెక్టర్.

గామిలో మీకు సవాల్ గా అనిపించింది ? 

మనం అనుకున్న ఎమోషన్స్ ని పెర్ఫార్మెన్స్ ల ద్వారా సరిగ్గా వ్యక్తం చేయించడం ఒక సవాల్. టెక్నికల్ గా ఎడిటింగ్ కూడా బిగ్గెస్ట్ సవాల్. కాంప్లెక్స్ సినిమాని ప్రేక్షకులందరినీ లీనం చేసేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం.

యూవీ వారు ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సపోర్ట్ వచ్చింది ? 

IMG 20240304 WA0161

ఫైనాన్సియల్ ఫ్రీడమ్ వచ్చింది. అన్ని వనరులు పెరిగాయి. మాకు కావాల్సిన సమయం ఇచ్చారు. మేము ఎదో కొత్తగా చేస్తున్నామని వారు నమ్మారు. చాలా బిగ్గర్ స్కేల్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

మీరు షార్ట్ ఫిల్మ్ నేపధ్యం నుంచి వచ్చారు కదా.. సినిమాకి దానికి ఎలాంటి తేడా గమనించారు ? 

నా వరకూ రెండిని ఒకేలా చూస్తాను. ఏదైనా అదే అంకిత భావంతో పని చేస్తాను.

శంకర్ మహదేవన్ పాట గురించి ? 

IMG 20240305 WA0134

శంకర్ మహదేవన్ గారు మా సినిమాలో పాట పాడటం ఒక గౌరవంగా భావిస్తాను.

 

ఈ గామీ సినిమా కోసం చాలా రిస్క్ సీన్స్ చేశామని హీరో హీరోయిన్ చెప్పారు! అంత లైఫ్ రిస్క్ అవసరమా?

నేను వాళ్ళతో పాటే వున్నాను. చేసిన ప్రతి రిస్క్ ని ముందు నేను లేదా మా సహాయ దర్శకుడు చేసి చూపించడం జరిగింది. అందరం రిస్క్ అంచునే ప్రయాణం చేశాం.

ఒకే ఆల్ ది బెస్ట్  అండ్ థాంక్ యూ విద్యానంద్ బ్రో..

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *