FNCC held Shankar Jaikishan Musical Night: ఎఫ్ ఎన్ సి సి లో శంకర్ జైకిషన్ మెలోడీస్ తో ఘనంగా మ్యూజికల్ నైట్ !

IMG 20240311 WA0225 e1710167522482

ఇటీవలే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలను తలుచుకుంటూ ఓక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, బాలరాజు గారు, ఏడిద సతీష్ (రాజా) గారు, వరప్రసాద రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు, లక్ష్మి నారాయణ గారు, గురువారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతూ : “ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన లక్ష్మి గారికి, గురువా రెడ్డి గారికి, మురళి గారి ధన్యవాదాలు. ఈ చల్లని సాయంత్రం మంచి మ్యూజిక్ తో ఆహ్లాదకరంగా జరుగుతోంది .ఈ ఫంక్షన్ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

IMG 20240311 WA0224

శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు మాట్లాడుతూ : ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారికి ఇంత అందమైన వేదిక ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి సాయం చేసినందుకు ధన్యవాదాలు. శంకర్ జైకిషన్ అభిమాన సంగం 2014 లో స్థాపించడం జరిగింది. కారణం నేటి సినిమా పాటలలో మెలోడీ పాటలు తగ్గిపోయాయి. పాత రోజుల్లో పాటలు ఎంత మధురంగా ఉండేవో నేటి యువతకి తెలిసేలా చేయాలి.

గోల్డెన్ ఎరా లో అన్ని పాటలు బావుండేవి, అందరూ బాగా చేసే వారు. వారిలో ఒకరైన శంకర్ జైకిషన్ పేరు పెట్టుకున్నాము. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు వైద్య సాయం చేయడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. భారత దేశం లో ఓ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ గారు ఫండ్స్ అడిగినప్పుడు మొదటిగా శంకర్ జైకిషన్ గారు ముందుకు వచ్చారు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం.

అదేవిధంగా ఎంతోమందికి ఆపరేషన్ల కోసం సహాయం చేశారు. ఆలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. అదే బాటలో మేము గతంలో కొన్ని కొంతమందికి సహాయం చేయడం జరిగింది.

ఈ సంవత్సరం ఈశ్వర్ చంద్ర హాస్పిటల్స్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీస్ ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాం. ఒకపక్క మంచి మెలోడీ సాంగ్స్ అందిస్తూనే శంకర్ జై కిషన్ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు చేసిన సహాయాన్ని కొనియాడారు. గురువారెడ్డి గారు చాలా మంచి వైద్యులు అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు.

IMG 20240311 WA0223

ఎఫ్ ఎన్ సి సి సభ్యులు లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ : గురువారెడ్డి గారు నూతనంగా హాస్పిటల్ మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. దుక్కిపాటి నరసింహారావు గారు నాకు చాలా సన్నిహితులు. లక్ష్మి గారు ఇలా ఓ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉంది. ఎఫ్ ఎన్ సి సి ఏర్పడటంలో తన వంతు కృషి ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అని, తనతో కలిసి పని చేయడం తనకి ఆనందం అన్నారు.

గురువారెడ్డి గారు మాట్లాడుతూ : సంగీతం హృదయాలను కదిలేలా చేస్తుంది. నేను శంకర్ గారిని కలవలేదు కానీ ఆయన సంగీతం అంటే చాలా ఇష్టం. నేను పాటలు పాడను కానీ బాగా వింటాను.

అలాగే నా హాస్పిటల్లో ఎఫ్ ఎన్ సి సి సభ్యులకు మంచి మెడికల్ ప్యాకేజ్ ఇస్తాను. నాకు కళాకారుడు , కల పోషణలు అంటే ఇష్టం. మీకు సేవ చేయడం నాకు ఇష్టం. రచయితలు, కళాకారులు, గాయకులూ తనకు దైవాంశ సంభూతులు అని పేర్కొన్నారు.

ప్రముఖులు మాట్లాడిన అనంతరం శంకర్ జైకిషన్ ప్రముఖ పాటలతో కార్యక్రమం కొనసాగింది. వచ్చిన వారు చల్లని వేళ ఈ సంగీత కార్యక్రమంలో మధురమైన పాటలను విని ఆనందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *