సంతోషం మరో సెన్సేషన్ ఒకే రోజు ట్రిపుల్ బొనాంజా టాలీవుడ్ హిస్టరీలో తొలిసారిగా ఓటీటీ అవార్డ్స్

santosham OTT awards e1670776669473

 

ఎప్పటికప్పుడు విభిన్నమైన వార్తలతో నిత్య నూతన అప్డేట్స్ తో సినీ ప్రేమికులందరినీ అలరిస్తూ వస్తున్న సంతోషం మ్యాగజైన్ అధినేత సినీ జర్నలిస్ట్, పీఆర్ఓ, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి మరో సరికొత్త ఆసక్తికరమైన అప్డేట్ తో ముందుకు వచ్చేశారు.

ముందుగా ప్రకటించినట్టుగానే 11వ తేదీ సాయంత్రం 6.8 నిమిషాలకు ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంతోషం టీం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 20 ఏళ్లుగా తెలుగు సినీ ప్రేక్షకులందరినీ అలరిస్తూ వస్తున్న స్టార్లను, టెక్నీషియన్ల టాలెంట్ గుర్తించి వారికి అవార్డులు అందిస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేశారు.

santosham OTT awards on 21st Dec2022

ఇప్పటికే సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలన్నింటికీ అవార్డులు అందిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈసారి మరో అడుగు ముందుకు వేసి ఓటీటీ ఫిలిమ్స్ కి కూడా అవార్డులు అందించాలని సంకల్పించారు. నిజానికి ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఇలా ఓటీటీ కంటెంట్ కు అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు.

డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదేరోజు సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కర్టెన్ రైజర్ ఈవెంట్ కూడా ఘనంగా జరగబోతోంది. అయితే ఈ రెండు జరగడానికి కారణం ఆ రోజు సంతోషం డిజిటల్ ఫిలిం న్యూస్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోంది.

santosham awards on 26st Dec2022 15days to go

కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ సహా మిగతా అన్ని రంగాలు మూతపడుతుంటే సినీ అప్డేట్స్, సినీ సెలబ్రిటీల అప్డేట్స్ కూడా ఆ సమయంలో అందించాలని ఉద్దేశంతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందుకుంటూ రెండు అడుగులు ముందే ఉండే సంతోషం సురేష్ సంతోషం ఫిలిం న్యూస్ పేరుతో యూట్యూబ్లో వార్తలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

అలా రిలీజ్ చేయడం మొదలుపెట్టిన ఎపిసోడ్స్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఏకంగా 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక ఇప్పటికీ సంతోషం ఫిలిం న్యూస్ కోసం సినీ పరిశ్రమంలోని చాలామంది ఉదయాన్నే ఎదురుచూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.

santosham awards on 26st Dec2022 15days to go 1

ఇక మొత్తం మీద సంతోషం ఫిలిం న్యూస్ 1000 ఎపిసోడ్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ రోజే సంతోషం ఓటీటీ అవార్డ్స్ కార్యక్రమం అలాగే సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 22 కర్టెన్ రైజార్ కార్యక్రమం కూడా జరగబోతూ ఉండడం తెలుగు వారందరికీ ఒక రకంగా ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022లో లాగానే సంతోషం ఓటీటీ అవార్డ్స్ లో కూడా పలు సర్ప్రైజ్లు దాగి ఉన్నాయి.

urvasi rautala ఇన్ సంతోషం అవార్డ్స్ 2022 2

ఇప్పటికే సంతోషం అవార్డుల ఫంక్షన్​లో బాలీవుడ్ భామ ఉర్వశీ రౌతెలా డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26వ తేదీన ఘనంగా జరగనుంది.

సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు సంతోషం సురేష్. సో తెలుగు ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ ద బిగ్ ట్రీట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *