First  Dialogue Poster FL Unveiled for Lakshmi  Kataaksham – For Vote  Movie: లక్ష్మీకటాక్షం మూవీ నుండి మొదటి డైలాగ్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదల !

IMG 20240415 WA0077 scaled e1713183632366

ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి అందులోను పోలిటికల్ సటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి లక్ష్మీకటాక్షం సినిమా నుండి డైలాగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటు కి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు, కాని ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు.

మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ “లక్ష్మీకటాక్షం : ఫర్ ఓట్” కు రచన, దర్శకత్వం సూర్య అందించారు, యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా. అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉంది ఈ డైలాగ్ పోస్టర్, అన్ని తరహ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

సీనియర్ నటులు సాయి కుమార్ మెయిన్ ముఖ్య పాత్రలో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. ఈ కథ నేపధ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు యూనిట్ పేర్కొన్నారు. త్వరలోనే సరదాగా ఉండే టీసర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని వెల్లడించారు

నటీ నటులు:

వినయ్, అరుణ్, దీప్తి వర్మ, చరిస్మా శ్రీకర్, హరి ప్రసాద్, సాయి కిరణ్ ఏడిద, ఆమనీ

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి, రచన, డైరెక్టర్: సూర్య, మ్యూజిక్: అభిషేక్ రుఫుస్, డి ఓ పి: నని ఐనవెల్లి, ఎడిటర్: ప్రదీప్ జే, సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు, పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *