Finally MSMP Movie got release date: సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న న‌వీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

msmp on sept 7

 

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు.

MSMP Anushka 2

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్ ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70,80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం..చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా, హ్యూమర్ క్రియేట్ చేసింది.

MSMP Anushka

అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి.

MSMP Anushka 7

న‌టీన‌టులు:

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు

MSMP Anushka 4

సాంకేతిక బృందం:
బ్యాన‌ర్‌: యువీ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు: వంశీ – ప్ర‌మోద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బాబు.పి
సంగీతం : రధన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, బృందా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: రాఘ‌వ్ త‌మ్మారెడ్డి
పి.ఆర్.వో : జీ.ఎస్.కే మీడియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *