మూవీ:ఫర్హనా (Farhana)
విడుదల తేదీ : మే 12, 2023
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్ తదితరులు
దర్శకులు : నెల్సన్ వెంకటేశన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
సంగీత దర్శకులు: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
ఎడిటర్: వీజే సాబు జోసెఫ్
ఫర్హనా రివ్యూ (FARHANA Movie Review):
ఐశ్వర్య రాజేష్ తాజాగా ఫర్హానా అనే మరో మహిళా ప్రధాన సినిమా ద్వారా ఈ శుక్రవారం తెలుగు తమిళ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో మా 18f మూవీస్ టీం సమీక్ష లో చదివి తెలుసుకుందామా !
కధ ను పరిశీలిస్తే (story line):
ఫర్హానా (ఐశ్వర్య రాజేష్) ఒక పవిత్ర ముస్లిం మహిళ, తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె మొదట కాల్ సెంటర్‌లో వర్క్ చేస్తుంది. ఆ తరువాత అందులోనే మరొక విభాగానికి మారుతుంది.
అక్కడ అనుకోకుండా ఆమె తెలియని ఒక కాలర్‌తో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకుంటుంది. ఆ తరువాత చివరికి అతనిని కలుసుకోవాలని భావిస్తుంది.
మరి ఆ తర్వాత ఏమి జరిగింది ?
ఫర్హానా అతన్ని కలిసిందా?
ఆమెకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా?
అసలు ఆ రహస్య కాలర్ ఎవరు?
అతని ఉద్దేశాలు ఏమిటి?
అతడిని కలిసిన అనంతరం ఫర్హానా సురక్షితంగా ఉందా ?
ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఎవరు ?
అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలి అంటే మీరు ఈ థ్రిల్లర్ సినిమా థియేటర్స్ లో తప్పక చూడాలి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
కథ బాగున్నప్పటికీ దాన్ని మరింత ఆకట్టుకునేలా కధనం ( స్క్రీన్ ప్లే) రాసుకోవడంలో రైటర్స్ మనుష్యపుతిరన్, నెల్సన్ వెంకటేశన్ మరియు శంకర్ దాస్ కొంచం తడబడినట్టు గా స్లో సీన్స్ ఉన్నాయి.
ఈ అనుకోని ల్యాగ్ వలన పలు సీన్స్ కొంత బోరింగ్ గా ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్ కూడా కొంత నీరసరంగా సాగడంతో పాటు స్క్రీన్ ప్లే లో పస లేదనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ విషయంలో కూడా డైరెక్టర్ కేర్ తీసుకోవాల్సింది.
మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే క్లైమాక్స్ ని ఆడియన్స్ ఆశిస్తారు. అయితే తక్కువ రన్ టైం ఈ మూవీకి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తీసుకున్న కథ యొక్క మెయిన్ పాయింట్ అలానే ప్రెజెంటేషన్ బాగున్నప్పటికీ దానిని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఇంకొంచెం స్పీడ్ గా ఉంటె బాగుండేది.
ఈ సినిమాలో తీసుకున్న రియలిస్టిక్ పాయింట్ ని బాగానే హ్యాండిల్ చేసారు. ఇక మెయిన్ ప్లాట్ ని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో ఆయన పర్వాలేదనిపించారు అనే చెప్పాలి.
నటి ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే గడచిన ఐదు నెలల్లో మొత్తం ఐదు సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు యువ నటి ఐశ్వర్య రాజేష్. అందులో ఈ శుక్రవారం తమిళ మరియు తెలుగు లో ఒకేసారి రిలీజ్ అయిన ఫర్హానా ఒకటి.
భార్యగా ఒక బిడ్డకు తల్లిగా ఆమె ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో మరొక్కసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వాస్తవానికి మరొక నటి ఎవరూ కూడా ఆ పాత్రని అంత బాగా పోషించలేరేమో అనిపిస్తుంది.
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్
నటుడు దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ తన పాత్రలో అలరించారు. సెకండ్ హాఫ్ లో ఎంతో సస్పెన్స్ తో అతడి సీన్స్ ని థ్రిల్లింగ్ గా పేస్ చూపించకుండా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఆయన డైలాగ్స్ కూడా ఆకట్టుంటాయి. కొన్ని డైలాగులు ఆలోచింపజేసేవిగా రాసుకున్న రైటర్స్ మనుష్యపుతిరన్, నెల్సన్ వెంకటేశన్ మరియు శంకర్ దాస్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి.
మిగిలిన పత్రాలు తక్కువ నిడివిలో ఉన్నప్పటికీ ఆయా నటులు చక్కగా నటించారు .
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గోకుల్ బెనోయ్ అందించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటర్ విజె సాబు జోసెఫ్ కొన్ని అనవసర సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అవి తప్పకుండా బిగ్ స్క్రీన్ పై ఎంతో బాగున్నాయి. ఐశ్వర్య రాజేష్, సెల్వ రాఘవన్ లకు డబ్బింగ్ చెప్పిన వారి వాయిస్ లు కూడా బాగున్నాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
ఫర్హానా మూవీ ప్రస్తుతం కాల్ సెంటర్స్ ముసుగులో జరుగుతున్న వాస్తవిక ఘటనలతో తెరకెక్కి డీసెంట్ గా పర్వాలేదనిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర, సెల్వ రాఘవన్ పెర్ఫార్మన్స్ ఎంతో బాగున్నాయి.మొదటి అంకం ( ఫట్ హాఫ్), రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో కొన్ని సీన్స్ పట్టించుకోకుండా ఉంటె ఈ మూవీ ఈ వారం చూసేయొచ్చు. కొత్త కధలు థ్రిల్లర్ సినిమాలు కోరుకునే వారి ఎంటనే మీ దగ్గరలోని థియేటర్ కి వెళ్ళి చూడండి.
టాగ్ లైన్: ఆకట్టుకొనే థ్రిల్లర్ !
18F Movies రేటింగ్: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.