Family star Movie Team Raise Police Complaint against influencers: విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు !

IMG 20240407 190735 scaled e1712497121483

ఫ్యామిలీ స్టార్ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది.

20240407 190542

నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో  కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

family star review by 18fms 6

ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ దేవరకొండ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.

ఇలానే గతం లో గుంటూరు కారం సినిమా కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేశారని సితార ఎంటర్టై్మెంట్ సంస్థ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కానీ ఇప్పటివరకు ఆ కేస్ వివరాలు మీడియా కీ కాని, పబ్లిక్ కి కానీ తెలియదు.

ఇప్పుడూ ఏమి జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాల్లకి ఇలాంటి చిల్లర నెగెటివ్ ప్రచారం చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *