విష్ణు విశాల్ మట్టి కుస్తీ తెలుగు రివ్యూ అండ్ రేటింగ్: ఫ్యామిలీ ని మెప్పించే బార్య-భర్తల ఇగో స్పోర్ట్స్ డ్రామా !

కుస్తీ తెలుగు రివ్యూ by 18 f movies e1669998933820

మూవీ: మట్టి కుస్తీ 

విడుదల తేదీ : 02-12- 2022

నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి, గజరాజ్, కరుణాస్, శ్రీజ రవి, మునిష్కాంత్, కాళీ వెంకట్, హరీష్ పేరడి, అజయ్, శత్రు

దర్శకుడు : చెల్లా అయ్యావు

నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్

సంగీత దర్శకులు: జస్టిన్ ప్రభాకరన్

సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్

ఎడిటర్: ప్రసన్న జికె

 

మట్టి కుస్తీ సినిమా తెలుగు రివ్యూ: 

తమిళ టాలెంటెడ్ యాక్టర్  విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Laxmi) కథానాయికగా నటించిన తెలుగు తమిళ మూవీ ‘మట్టి కుస్తీ’. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి తెలుగు  ప్రేక్షకులను ఈ మట్టి కుస్తీ చిత్రం   ఏ మేరకు అదరించ గలదో  మా 18 f టీం సమీక్షచదివి  తెలుసుకుందామా !

matti kusti song out

కధ (STORY) పరిశీలిస్తే:

వీర (విష్ణు విశాల్) తన జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఫ్రెండ్స్ తో సరదాగా మందు కొడుతూ ఊరిలో గట్టు – పంచాయితీలు చేస్తూ బలాదూర్ గా  బతికేస్తుంటాడు. బలాదూర్ వీర పెళ్లికి సిద్ధం అయి తనకు కాబోయే భార్య కి జుట్టు పొడవుగా, చదువు ( తన చదువు కంటే)  తక్కువగా ఉండాలని షరతులు పెట్టి అలాంటి  అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటాడు .

మరోపక్క కేరళ లో ఉంటున్న  కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కుస్తీలో స్టేట్ లెవల్ ప్లేయర్. మగ రాయుడిలా జుట్టు కత్తిరించి తప్పుచేసిన మగ వాళ్ళ తో  కుస్తీలు  పడుతూ ఉంటుంది. పైగా కీర్తి దూకుడు తో కూడిన ధైర్యవంతురాలు. అలాంటి కుస్తీ అమ్మాయి  కీర్తి కి   పెళ్లికొడుకు కోసం తన ఫ్యామిలీ కేరళ మొత్తం వెదికి వెదికి ఎవరు పెళ్ళికి రకపోయే సరికి  వెరే స్టేట్ అబ్బాయి అయిన పరవాలేదు అనే స్తితికి వచ్చేస్తారు.

వీర కోరుకున్న అమ్మాయికి – కీర్తి  పూర్తి గా  విరుద్ధం. అయితే కీర్తి భాభాయి 1000 అబద్దాలు అడీ ది అయిన ఒక  పెళ్లి చేయమన్నారు మన పెద్దలు అని మనం రెండు అబద్దలు ఆడటం లో తప్పు లేదు అంటూ   కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీర కి – కీర్తి కి పెళ్లి జరిపిస్తారు. మరి అసలు  నిజం వీర – కీర్తికి  తెలిశాక,

వీర – కీర్తి ల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి?,

వీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉంటారా? లేదా ?,

ఆడవారు గొప్పా .. మగవారు గొప్పా ?

భార్య భర్తలలో ఎవరు ఎవరి మాట వినాలి ?

స్పోర్ట్స్ లో మహిళలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి ?,

మన దేశం నుండి ఎంత మంది మహిళలు క్రీడలలో పాల్గొంటున్నారు ?,

తల్లి దండ్రులు ఆడపిల్లలను ఎందుకు స్పోర్ట్స్ కి దూరంగా పెడుతున్నారు ?

అసలు మట్టి కుస్తీ క్రీడలో వీర తన భార్య కు పోటీగా పాల్గొనాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు ?

అనే ప్రశ్నలు మిమ్మలను కూడా ఆలోచించేలా చేస్తే తప్పక ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ అందులో ఉన్న చిన్న మెసేజ్ కూడా ఫాలో అయితే అసలు భార్య -భర్తల దాంపత్య జీవితం ఇగో అనే పదాన్ని దూరంగా పెడితే ఎంతో సంతోషంగా  ఆనందంగా ఉంటుంది కదా అని పిస్తుంది.

 

matti kusti poster

కధ కథనం (SCREEN – PLAY) పరిశీలిస్తే:

సినిమా మెయిన్ పాయింట్ లో విశయం ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు చెల్లా అయ్యావు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి ఎంటర్ టైన్మెంట్ తో నడపాలి.

ముఖ్యంగా మొదటి భాగం ( ఫస్ట్ హాఫ్)  కంటే రెండవ భాగం ( సెకండ్ హాఫ్) గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ సినిమాలో కధనం లో  అది మిస్ అయింది. ఇంకా కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ రాసుకొని ఉంటే బోర్ లేకుండా హ్యాపీ గా సాగిపోయేది.

హీరో తన భార్య ను సెలక్ట్ చేసుకోవడం లో  మోసపోయాను అని తెలుసుకున్న దగ్గర నుంచి రెండవ అంకం లో  సాగే సన్నివేశాలు పూర్తి పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు.

అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సమస్యకు సరైన బలం లేదు. అలాగే ఉన్న సమస్యను కూడా బలంగా చూపించడంలో కూడా దర్శకుడు నిరాశ పరిచాడు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఫన్ తో సాగింది.

కా నీ.. ఇంటర్వెల్ తర్వాత కామెడీ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. హీరో ట్రాక్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు గానీ, అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ కాలేదు.

matti kusti poster 22

నటి-నటుల నటన పరిశీలిస్తే:

హీరో గా చేసిన విష్ణు విశాల్ నటన తో ఆకట్టుకున్నాడు. చాలా పరిణితి చెందిన నటుడుగా నటించి మేపపొయించాడు. విష్ణు విశాల్ సినిమా గ్రాఫ్ చూస్తే రచ్చసాన్ (తెలుగు లో రాక్షసుడు)  సినిమా ముందు తర్వాత గా మాట్లాడు కోవాలి. ఈ మట్టి కుస్తీ కి తానే ప్రొడ్యూసర్ కాబట్టి ఖర్చుకి వేకాకద కుండా భాగ్య తీశాడు.

హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి కూడా తన రఫ్ మూమెంట్స్ తో పాటు తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.

మరో కీలక పాత్రలో నటించిన తెలుగు యాక్టర్ అజయ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. స్పోర్ట్స్ కోచ్ గా శత్రు కూడా బాగా నటించాడు క్లైమాక్స్ ఫైట్ లో అయితే అద్బుతంగా ఫెరఫామ్ చేసశాడు.

అలాగే  మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు బాగానే ఉన్నాయి. నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

matti kusti pre release event poster

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే: 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటర్ మణికందన్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

matti kusti vishnu vishal

18F Movies టీం ఒపీనియన్ :

తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని క్రీడ మట్టి కుస్తీ. అదే పేరుతో  వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ ట్విస్ట్  బాగున్నాయి. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి.

రెండవ అంకం లో  ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

ఐతే, సినిమాలో విష్ణు విశాల్ నటన, ఐశ్వర్య లక్ష్మి లుక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం భార్య -భర్తలను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుదిరితే దియేటర్ కి వెళ్ళి చూడండి. లేకపోతే 4 వారాలు ఆగితే ఓటీటీ లో వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం ఫ్యామిలీ కలిసి చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

పెళ్ళికి ముందు అమ్మాయికి అబ్బాయికి ఇగోలు ఉన్నా పెళ్లి అనే బంధం తో కలిసి కాపురం చేసేటప్పుడు ఇగోలు పక్కకు నెట్టి  ఒకరికి ఒకరు తోడుగా  ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటే ఆ భార్య -భర్తల బంధం నిండు నూరేళ్ళు సంతోశంగా ఉంటుంది అని చెప్పే సినిమా ఇది.

ఏంటో ఈ మట్టి కుస్తీ సినిమా రివ్యూ లో మా అభిప్రాయం ఎక్కువగా రాసినట్టు ఉంది.

భార్య – భర్తల తప్పక చూడవలసిన ఇగో స్పోర్ట్స్ డ్రామా….

18F MOVIES RATING: ౩ / 5

* కృష్ణ ప్రగడ,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *