‘కళ్యాణం కమనీయం’ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతమైన స్పందన!!

kk poster

 

సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రంతో యువి క్రియేషన్స్ యువి కాన్సెప్ట్స్, మంచి కథకి తగ్గ నటన వాటికి కావలిసిన నిర్మాణ విలువలు, సాంకేతిక సహాయం అందిస్తే ఫలితం ఎలా ఉంటుందో చేసి చూపించారు.

kk santish and priya

అపార్థాల మధ్య భర్త విలువని, భార్య ప్రేమని అర్ధంచేసుకునే జంటగా సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ లు నటించిన ఈ కథకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తుంది.

kk stills
మొదటి చిత్రమైనా, దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ చాలా నిజాయితీగా కథకి న్యాయం చేస్తూ అనవసరమైన మార్పులు చేర్పులు చేయకుండా తీసారు. శృతి పాత్రని తమలో, కూతురిలో, అమ్మలో, చెల్లెళ్లలో చూసుకుంటున్నారు, తమకి జరిగిన అనుభవాలని గుర్తు చేసుకుంటున్నారు.

kk team thanks audience

వీటన్నిటికీ తోడుగా శోభన్, ప్రియా భవాని నటన, కెమిస్ట్రీ, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం స్క్రీన్ పై అద్భుతంగా పండింది.

నటులు సత్యం రాజేష్, కేదార్ శంకర్, సప్తగిరి, సద్దాం, దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *