ఘనంగా “ఫెయిల్యూర్ బాయ్స్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ !

IMG 20251011 WA0336 e1760182878709

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్ పై వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు.  వెంకట్ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

IMG 20251011 WA0338

నిర్మాత ధన శ్రీనివాస్ జామి మాట్లాడుతూ – ఈ రోజు మా “ఫెయిల్యూర్ బాయ్స్” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వినోదంతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాం. చిత్ర నిర్మాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

అన్నీ కుదిరితే ఈ నెలలోనే మా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. చిత్ర నిర్మాణంలో నాకు సపోర్ట్ గా నిలిచినా నా స్నేహితుడు వెంకట్ రెడ్డికి థ్యాంక్స్. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నాం. ఆ రోజు మూవీ గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుతాను. అన్నారు.

IMG 20251011 WA0337

నిర్మాత లక్ష్మి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమాను మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటుడు సూర్య మాట్లాడుతూ – “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి లాంటి మంచి నటులు ఉన్నారు. యంగ్ టీమ్ అంతా ఈ సినిమాకు వర్క్ చేసింది. “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమా పెద్ద సక్సెస్ అందుకుని దర్శక నిర్మాతలకు, మూవీ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో “ఫెయిల్యూర్ బాయ్స్” చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నటీనటులు :

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని, సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్, తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఎడిటింగ్ – ఎంఆర్ వర్మ, డీవోపీ – దాము నర్రావుల, మ్యూజిక్ – విజయ్ బుల్గానిన్, బ్యానర్ – శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్, పీఆర్ఓ – వీరబాబు, నిర్మాతలు – వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి, రచన, దర్శకత్వం – వెంకట్ రెడ్డి ఉసిరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *