అంచనాలు పెంచుతున్న కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ న్యూ ఇయర్ మోషన్ పోస్టర్

ghost shiv rajkumar e1672649489972

ప్రస్తుత బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఏజ్ లో ప్రేక్షకులు ఉత్కంఠ రేపే రోమాంచితమైన సినిమాలనే థియేటర్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి చిత్రం తోనే వస్తున్నారు కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో ఘోస్ట్ రూపొందుతోంది.

కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా టీం అద్భుతంగా డిజైన్ చేసిన రెట్రో మోషన్ పోస్టర్ తో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ghost poster
ఘోస్ట్ మోషన్ పోస్టర్ ను ఎంతో కేర్ తీసుకుని డిజైన్ చేశారు. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా పోస్టర్ ఉంది. కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, ఎరిగే బుల్లెట్లు, మెషీన్ గన్… వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివన్న వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తారు.

GHOST SHIVANNA
ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

SHIVANNA ghost first look

మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

SHIVA RAJKUMAR HAPPY BIRTHDAY GHOST POSTER
క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ :  సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజు’స్ టీం

https://www.youtube.com/watch?v=BmsDEMcP9mU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *