ఈటీవీ విన్ లో కిరణ్ అబ్బవరం “క“ స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!

IMG 20241127 WA0272 e1732724960603

థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఈ మూవీ ఈ నెల 28వ తేదీన ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా డిజిటల్ ప్రీమియర్ కు వస్తోంది. ఫస్ట్ టైమ్ డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో “క“ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుండటం విశేషం. ఓటీటీల్లో ఇదొక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతోంది.

థియేటర్స్ లో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో ఈటీవీ విన్ లో “క“ సినిమా చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.

IMG 20241127 WA0270

“క“ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ “క” సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా..మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై డిస్ట్రిబ్యూట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *