లిటిల్ హార్ట్స్ లానే  “రాజు వెడ్స్ రాంబాయి” తో ధియేటర్స్ కి వస్తున్న ఈటీవీ విన్!

IMG 20251029 WA0432 e1761747479381

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి“. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో..

IMG 20251029 WA0270

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్ లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారు అనుకునేవాళ్లం.

ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు పాత్రలో బాగా నటించాడు. తేజస్విని తెలుగు అమ్మాయి. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య ఒక మంచి రోల్ చేశాడు. అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఈటీవీ విన్ వారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ – రాజు వెడ్స్ రాంబాయి పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ చిత్రంలో చూస్తాం. తెలంగాణ నేటివిటీని ఇంత పర్పెక్ట్ గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. ఒకే ఒక నెరేషన్ లో వేణు ఊడుగుల గారు మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు.

ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా టేకాఫ్ అయ్యింది. సాయికృష్ణ, నితిన్ నాకు బ్రదర్స్ లా సపోర్ట్ చేశారు. వేణు అన్న తోడునీడలా ఉన్నారు. సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – రాజు వెడ్స్ రాంబాయి లాంటి మంచి కథ ఉన్న చిత్రానికి నేను మ్యూజిక్ డైరెక్టర్ గా న్యాయం చేయగలను అని నమ్మిన వేణు ఊడుగుల అన్నకు, ఈటీవీ విన్ వారికి, డైరెక్టర్ సాయిలు గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుతా. మా సినిమా టీమ్ కు మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

IMG 20251029 WA0274

ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని బేస్ చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది.ఈ కథను ఎంటర్ టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు.

ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్ ను అయ్యాను. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ అవుతుంది. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నా. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అన్నారు

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ – రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి క్యారెక్టర్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరయ్యాయి. సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక ఎమోషన్ కు గురవుతారు, మూవీని ఇష్టపడతారు. తెలుగు ఆడియెన్స్ కు మా మూవీ బాగా నచ్చుతుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, మా డైరెక్టర్ సాయిలు, వేణు గారికి థ్యాంక్స్. అన్నారు.

IMG 20251029 WA0433

హీరో అఖిల్ మాట్లాడుతూ – నాకు సినిమా అంటే పిచ్చి. యాంకర్ గా పనిచేశాను. అక్కడి నుంచి ఇప్పుడు హీరోగా మీ ముందుకు వస్తున్నా. నాలాగే మా డైరెక్టర్ సాయిలు గారికి సినిమా అంటే పిచ్చి. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న వేణు గారికి, ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. నవంబర్ 21న మా మూవీ చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

ఈటీవీ విన్ నితిన్ మాట్లాడుతూ – మన ప్రాంతంలో జరిగిన ఒక నిజమైన ఘటన నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. ఆ ఘటన గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం ఆశ్చర్యం. రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ అయ్యాక తెలుగు ఆడియెన్స్ అంతా ఒకసారి మా మూవీ గురించి మాట్లాడుకుంటారు. మేము ఈ సినిమాను గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామో మీకు తెలుస్తుంది. మీరు లైఫ్ లో ఎన్ని సినిమాలు చూసినా కొన్నే గుర్తుంటాయి. అలా గుర్తిండిపోయే మూవీ రాజు వెడ్స్ రాంబాయి అవుతుంది. 7 జీ బృందావన్ కాలినీ, ప్రేమిస్తే, గజినీ, బేబి..ఇలా లిస్టులో రాజు వెడ్స్ రాంబాయి చేరుతుంది. అన్నారు.

IMG 20251029 WA0282

ఈటీవీ విన్ సాయికృష్ణ మాట్లాడుతూ – రాజు వెడ్స్ రాంబాయి సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని మేము అంటున్నాం. నిజమో కాదో మీరు చూసి చెప్పాలి. రాహుల్, తన్మయ్ ఈ సినిమాకు ఫిల్లర్స్ లా ఉన్నారు. వాళ్లు లేకుంటే ఈ సినిమా రిలీజ్ కు వచ్చేది కాదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా మంచి సినిమాలను రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ – లిటిల్ హార్ట్స్ మూవీ చేసిన వెంటనే మేము రిలీజ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ఈవెంట్ లో బ్యాండ్ తో సౌండ్ చేశాం. నవంబర్ 21న అంతకంటే ఎక్కువ సౌండ్ చేస్తామని చెప్పగలను. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని చాలా మందిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంటుంది. మా మూవీ కాస్ట్ అండ్ క్రూ అంత బాగా మూవీ చేశారు. నవంబర్ 21న థియేటర్స్ కు వచ్చి రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు :

అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు..,

టెక్నికల్ టీమ్: 

కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోటసౌండ్ డిజైన్ – ప్రదీప్.జి., పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి, సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్, మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – నరేష్ అడుపా, కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్, ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి, రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి, ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్,థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి (వంశీనందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్), పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *