Em Chestunnav Movie Streaming on ETV Win : ఈటివి విన్ డిజిటల్ బ్లాక్ బస్టర్ అయిన ‘ఏం చేస్తున్నావ్ ’ సక్సెస్ మీట్ !

em Chestunnav success meet with etv win team e1714141636593

ఈ మధ్య ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలలో గనుక కంటెంట్ ఉంటె ప్రేక్షకుల నుండి చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి. కాని అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన సినిమాలలో ‘ఏం చేస్తున్నావ్’ ఒకటి. చాలా సైలెంట్ గా ఈటివి విన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది.

ఇటీవలే స్టార్ట్ చేసినా కూడా మంచి మంచి హిట్స్ ను వారి ఖాతాలో వేసుకుంది ఈటివి విన్. ఇంతక ముందు 90s, వలరి, తులసి వనం లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈటీవి విన్ ఇప్పుడు ఈ ‘ఏం చేస్తున్నావ్ ’ తో మరో హిట్ అందుకుంది.

em Chestunnav success meet with etv win team 2

నవీన్ కురువ, కిరణ్ కురువ నిర్మాతలుగా ‘ఏం చేస్తున్నావ్ ’ ఎన్ వి ఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి రచన దర్శకత్వం భారత్ మిత్ర అందించారు. ఎన్నో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు.

ఈ ‘ఏం చేస్తున్నావ్’ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వచ్చింది. హీరో రాజ్ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రసంశలు వచ్చాయి. యూత్ కి నచ్చే ఎన్నో ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ని చాలా మంది స్టూడెంట్స్ అండ్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న యూత్ అందరూ రిలేట్ అయ్యేలా, కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ చేస్తూ తీసారు.

em Chestunnav success meet with etv win team 1

ఈటీవి విన్ మార్కెటింగ్ హెడ్ నితిన్ మాట్లాడుతూ: ఈ వేసవిలో పెద్దగా సినిమాలు ఏమి లేవు. భయత చేసే పోల్యుటెడ్ మార్కెటింగ్ ఏం చెయ్యకపోయినా ఈ సినిమాకి ఆర్గానిక్ గా చాలా మంచి సక్సెస్ వచ్చింది. కచ్చితంగా ఫ్యామిలీ మొత్తం చూడాలిసిన సినిమా ఇది, మీరు ఈ సినిమా చూస్తున్నంత సేపు అస్సలు రీగ్రేట్ అవ్వరు. ఈటీవి విన్ లో ప్రేక్షకులు రీగ్రేట్ అయ్యే కంటెంట్ అస్సలు రాదు అని చెప్పారు

ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ: ఈ సినిమాలో చాలా వాటికి మనం రిలేట్ అవుతాము, రోజు మనం చూసే మన పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరు ఈ సినిమాలో కనిపిస్తారు. భరత్ చాలా బాగా రాశారు, డైరెక్ట్ చేసారు. ప్రేక్షకులు రిలేట్ అయ్యే కంటెంట్ ఈరోజుల్లో చాలా తగ్గిపోయింది. ఈ సినిమాలో ఈటీవి విన్ లో చాలా మంచి సక్సెస్ అయ్యింది.

em Chestunnav success meet with etv win team 3

డైరెక్టర్ భారత్ మిత్ర మాట్లాడుతూ: మా ప్రొడ్యూసర్ నవీన్ వల్లనే ఈ సినిమా చేశాను, తను ఒక చిన్న ఊరులో బట్టలు కొట్టు పెట్టుకుని ఏడు సంవత్సరాలు దాచుకున్న డబ్బులతో ఈ సినిమా చేశారు. తరవాత బజ్జేట్ పెరిగింది, అప్పుడు హేమంత్ టీంలోకి వచ్చారు.అందరికి చాలా బాగా రీచ్ అయింది సినిమా, మీమర్స్ ద్వారా సినిమా ప్రేక్షకులలోకి వెళ్ళింది. అందుకనే ఏలూరు శ్రీను గారు సలహా మేరకు మీమర్స్ అందరితోనే మా సక్సెస్ జరుపుకుందాం అని మీతోనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం అని థాంక్స్ చెప్పారు.

తారాగణం:

విజయ్ రాజ్ కుమార్, నేహ పతన్, అమితా రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాలా, ఇతరులు..

టెక్నీషియన్స్: 

రచన్ దర్శకత్వం: భరత్ మిత్ర, నిర్మాతలు: నవీన్ కురువ, కిరణ్ కురువ, బ్యానర్: యెన్విఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ వరల్డ్, మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్, సినిమాటోగ్రఫీ: ప్రేమ్ అడివి, ఎడిటర్: హరి శంకర్ టియెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *