చిత్రం: ఈసారైనా?!,
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ తదితరులు,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్,
సహ నిర్మాత: సంకీర్త్ కొండా,
సంగీతం: తేజ్,
డీఓపీ: గిరి,
ఎడిటింగ్: విప్లవ్.
మూవీ: ఈసారైనా? రివ్యూ ( Eesaraina Movie Review)
ఒకపక్క ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలగంటూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ మరో పక్క మనసుకి ఇష్టమైన ఆమ్మాయి ప్రేమను పొందలనుకొనే యువకుడి జీవిత కథ ని ఈసారైనా ? అనే సినిమా గా తీసి ఈ శుక్రవారం రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు విప్లవ్ & సంకీర్త్ కొండా లు .
మరీ ఈసారైనా ? సినిమా ఎలా ఉందో మా 18 F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందమా !
కధ పరిశీలిస్తే (Story Line):
డిగ్రీ పూర్తి చేసుకుని నాలుగేళ్లు అవుతున్న ఉద్యోగం లేకుండా గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం చూస్తూ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుంటాడు రాజు (విప్లవ్). అప్పటికే అదే ఊర్లో హీరోయిన్ శిరీష (అశ్విని) గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తూ ఉంటుంది.
మూడుసార్లు నోటిఫికేషన్ వచ్చి ఫెయిలవుతాడు రాజు. తను ఎలాగైనా జాబు సాధిస్తాడని తన స్నేహితుడు మహబూబ్ బాషా మరియు అశ్విని హీరోని ఎంకరేజ్ చేస్తుంటారు. అశ్విని తండ్రి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు.
హీరో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా లేదా?,
చివరికి హీరోయిన్ తండ్రి ఎలా మారాడు?,
రాజు శిరీష ల ప్రేమ పాలించిందా ?,
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఈసారైనా!?’ సినిమా వెంటనే దియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
‘ఈసారైనా!?’ సినిమా కధ- కధనం గురించి చెప్పాలి అంటే, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ మరో పక్క ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నించే ఒక యువకుడి కథ. జీవితంలో సెటిల్ కాకుండానే ప్రేమలో పడి ఇబ్బందులు పడే యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను కధనం రాసుకొన్న తీరు బాగుంది.
నిజానికి హీరో అల్లరి చిల్లరగా తిరగకుండా కష్టపడి చదవాలని ప్రయత్నించిన ప్రభుత్వ నోటిఫికేషన్ల కారణంగా తనకు ఉద్యోగం రాదు, ఒకపక్క ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఫస్ట్ ఆఫ్ పూర్తవుతుంది.
తర్వాత హీరోయిన్ ని చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు చివరికి ఎలా చేరుకున్నాడు లాంటి విషయాలను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా, ప్రతి సీన్ ఒక క్లీన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ గా సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కొత్త దర్శకుడు విప్లవ్.
ముఖ్యంగా ఇలాంటి ఇన్సిపిరేశన్ కధ ని సినిమా గా మలచాలనే ఆలోచనను ప్రోత్సహించి డబ్బులు పెట్టిబడి పెట్టిన సహ నిర్మాత సంకీర్త్ కొండా ని, టీం ని అభినందించవచ్చు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
విప్లవ్ హీరో గానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా ఎడిటర్ గా అన్ని తానే ఈ ఎక్కడ కాంప్రమైస్ కాకుండా తన సొంత ఊరిలో అద్భుతంగా నిర్మించారు. పల్లెటూరిలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న కుర్రాడు రాజు లా విప్లవ్ అద్భుతంగా నటించాడు.
అశ్విని స్క్రీన్ ప్రసన్స్ యాక్టింగ్ చాలా బాగున్నాయి. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి గారి నటన బాగుంది. ఒకపక్క నవ్విస్తూనే సీరియస్ తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు. సపోర్టింగ్ క్యారెక్టర్ లో స్నేహితుడిగా మహబూబ్ బాషా నటన నవ్విస్తూ అలరిస్తుంది.
మిగిలిన పాత్రలలో సత్తన్న, అశోక్ మూలవిరాట్ ఎవరు పరిధి మేరకు వారి పాత్రల్లో నటించారు. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ లో సలార్ కార్తికేయ దేవ్ మరియు హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నీతు సుప్రజ నటన బాగుంది.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సహ నిర్మాతగా సంకీర్త కొండ విప్లవకి సపోర్టుగా నిలబడి ఈ సినిమాని నిర్మించారు.
గిరి సినిమాటోగ్రఫీ తేజ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. అదేవిధంగా గోరేటి వెంకన్న గారు, రాకేందు మౌళి మరియు శరత్ చేపూరి అందించిన పాటలు బాగున్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
ఈసారైనా?! సినిమా విప్లవ్ కి హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయిత గా మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా. అన్ని తానే అయి ఈ సినిమాని పూర్తిచేశాడు. పల్లెటూరులోని అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని తీశారు. విప్లవ్ అశ్విని ల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.
సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఏ గాయమొ సాంగ్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చిన్నపిల్లల బ్యాక్ డ్రాప్ లో వచ్చే తారా తీరమే సాంగ్ మంచి లవ్ సాంగ్. అశోక్ మూలవిరాట్ పాత్ర వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. యువత తప్పక చూడవలసిన చిత్రం.