EAGLE Movie Telugu Review & Rating: రవితేజ ఈగల్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ! లేదా !

eagle movie review by18fms e1707491766431

మూవీ: ఈగల్ మూవీ 

విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024

నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు.,

దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని,

నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్,

సంగీత దర్శకులు: డావ్ జాన్డ్,

సినిమాటోగ్రాఫర్‌లు: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి,

ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని,

ఈగల్ రివ్యూ (EAGLE Movie Review):

మాస్ రాజా రవితేజ హీరోగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్స్ గా  కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మోస్ట్ యాక్షన్ అండ్ స్టైలిస్ చిత్రం ఈగల్. గత సంక్రాంతి భారీలో ఉండవలసిన ఈ చిత్రం, అనుకోని కారణాలు, ఇండస్ట్రి పెద్దల రిక్వెస్ట్ తో వాయదా పడి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైంది.

రవి తేజ ని గతం లో చూడని లుక్ లో ప్రెసెంట్ చేసిన ఈ ఈగల్ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !

eagle movie review by18fms 11

కధ పరిశీలిస్తే (Story Line): 

నళినీ రావు (అనుపమ పరమేశ్వరన్) ఢిల్లీ లో  జర్నలిస్ట్ గా పనిచేస్తూ  తలకోన అడవుల్లో కొండలపై పండించే పత్తి, దాంతో తయారైన అరుదైన కాటన్ క్లాత్, ఆ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి సహదేవ వర్మ (రవితేజ) ఆచూకీ ఏడాదిగా ఎవరికీ తెలియదని చిన్న ఆర్టికల్ రాస్తుంది. దాంతో ఏకంగా పేపర్ ఆఫీస్ మీద సీబీఐ దాడులు చేస్తుంది. చివరకు, నళినీ రావు ఉద్యోగం పోతుంది. ఎవరీ సహదేవ వర్మ అని ఆమెలో క్యూరియాసిటీ మొదలవుతుంది. తను సొంతంగా ఆ ఊరు వెళ్ళి ఆ కధ తెలుసుకోవాలి అని నిర్ణయించుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఎంక్వెరీ మొదలు పెడుతుంది.

ఏపీ లొని మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ ) విగ్రహాన్నిపెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. ఐతే, జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) ఆ ప్రాంతం లొని ఒక్కొక్కరిని అడుగుతూ కొద్దిగా కొద్దిగా సహదేవ్, ఈగల్ గురించి తెలుసుకొంటుంది.

అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహదేవ్ కధ చెప్తూ ఉంటారు. ఇలా సహదేవ్ గురించి తెలిసిన, సంబంధం ఉన్న ఒక్కొక్కరి కధని కలుపుతూ చివరికి ఏమి చేసింది అనేదే కధ..

eagle movie review by18fms 5

ఇంతకీ, సహదేవ వర్మకి ఆ కాటన్ క్లాత్ కి ఉన్న సంబంధం ఏమిటి ?,

తలకొనలో పత్తి రైతులకు సహదేవ్‌కు సంబంధం ఏమిటి?

 చేనేత రైతులకు ఎలాంటి ఉపకారం చేశాడు?

తను నిర్మించుకొన్న వెపన్ ఫెసిలిటీని ఎలా ఉపయోగించుకొన్నాడు?

ఇంతకీ, ఈ సహదేవ్ వర్మ ఎవరు ?,

రచన (కావ్య థాపర్)కు సహదేవ్‌కు రిలేషన్ ఏమిటి?

ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది ?,

ఆయుధాల అక్రమ రవాణాను ఎలా అడ్డుకొన్నాడు?,

తన సామ్రాజ్యాన్ని టార్గెట్ చేసిన ఇండియన్ ఆర్మీని సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు?,

ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు ? అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే, ఈ ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ కలిగించి ఉంటే ఎంటనే దియేటర్ కి వెళ్ళి సినిమా చూసేయండి.

eagle movie review by18fms 7

కధనం పరిశీలిస్తే (Screen – Play):

రవి తేజ కు సరిపడే కధను తయారు చేసుకొని ఈగల్ అనే పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని, అంతే స్థాయిలో ఈగల్ సహదేవ్ వర్మ గా కాటన్ మిల్లు యాజమాణిగా ఎందుకు మరవలసి వచ్చిందో కధనం (స్క్రీన్ – ప్లే) లో చెప్పలేక పోయాడు అనిపఇస్తుంది.  మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) అంతా కధలేకుండా కేరక్టర్ పరిచయాన్ని ఒక్కొక్కరితో ఒక్కో విధంగా చెప్పిస్తూ రెండవ అంకం (సెకండ్ ఆఫ్ ) కి వచ్చేసరికి మంచి ఎమోషన్ ఉన్నా పాత్రల పరంగా సరైన ట్రీట్మెంట్ ను రాసుకోలేదు.

ముఖ్యంగా లుక్ & ఫీల్ అండ్ యాక్షన్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ ను ఆసక్తికరంగా సాగవలసిన కథనాన్ని రాసుకోవడంలో కొద్దిగా తడబడినట్టు అనిపఇస్తుంది. చాలా సన్నివేశాలు బిల్డ్ అప్ షాట్స్ తో రెగ్యులర్ కధనం తో సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా సినిమా అంతా రెగ్యులర్ సిన్మా ఫార్మాట్ లోనే సాగింది అనిపఇస్తుంది.

 

ఒక్క చివరి ఘట్టం ( క్లైమాక్స్) లో తప్ప మిగిలిన కథనంలో ప్రేక్షకులకు ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, కార్తీక్ ఘట్టమనేని మాత్రం తన ఒక స్టైలిస్ ఫిల్మ్ చెయ్యాలి అని ఫిక్స్ అయి చేసినట్టు ఉంది.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ‘కావ్య థాపర్’పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్ గా ఆ పాత్రకి ముగింపు ఇస్తూ, ఆ పాత్ర ద్వారా నే ఈగల్ లో సహదేవ్ ని చూశాను, నువ్వే ఈ సమస్యకు పారిస్కారం కనిపెట్టు అని చెప్పి ఉంటే ఆడియన్స్ ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది.

ఈ ఈగల్ కధనం లో నున్న ఇంకో ముఖ్య విశయం ఏంటంటే, మొత్తం కధ – కధనం అంతా పాటల తోను, వాయిస్ ఓవర్ తోను చెప్పాలనుకోవడం. ఇలాంటి స్క్రీన్ ప్లే టెక్నిక్ వినడానికి బాగున్నా స్క్రీన్ మీద మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ లో తేలిపోయింది. కొంతమంది మీడియా మిత్రులు సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి అసలు కధ ఏంటి? డైరెక్టర్ ఏమి చెప్పాలి అనుకొన్నాడు అని అడిగారు. ఇలా అడిగారు అంటే వాయిస్ ఓవర్, పాటలో వచ్చేటప్పుడు సరిగా వినక లేక ఆ టైమ్ లో మొబైలు చూస్తూ ఉండడటం వాలనో వారు ఆ పాయింట్ మిస్ అయ్యారు.

eagle movie review by18fms 6

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కధ కు యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్టు ఉంది. రవి తేజ అబిమానులు గతం లో చూడని లుక్ లో రవి తేజ ని ప్రెసెంట్ చేసిన విధానం బాగుంది.

యాక్షన్ పార్ట్ ఎక్కువ అవ్వడం వలన కధను చెప్పడం లో కొంచం తడపడినా రెసి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ గన్స్ యుజెస్, హౌస్ శేట్ అప్, కాళీ మాత ఎపిసోడ్ డిజైన్ చాలా బాగున్నాయి.

ఈగల్’- సహదేవ్ వర్మ అనే పాత్రలో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రవితేజ చాలా బాగా నటించాడు.

హీరోయిన్ గా కావ్య థాపర్ కి లభించింది చిన్న పాత్ర అయినా తన నటనతో మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. సాంగ్స్ లో కూడా క్యూట్ గా కనిపించింది.

కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా మెప్పించింది. జర్నలిస్ట్ పాత్రలో తెలియని విశయాలు దగ్గర అమాయకంగానే ఉంటూ, చిన్నచిన్న విశయాలు దగ్గర ఏడీటీ వ్యక్తిని భయపెడుతూ ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడం లో బాగా నటించింది.

మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా బాగానే నటించాడు. ఫస్ట్ టైమ్ అయినా సరే రవి తేజ – నవదీప్ కాంబో కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు.

eagle movie review by18fms 3

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

 సంగీత దర్శకుడు డావ్ జాన్డ్ కి ఇది డెబ్యూ సినిమా అయినా చాలా బాగానే చేశాడు. తన అందించిన పాటలు పర్వాలేదు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ లవ్ ఇంగ్షీషు లిరిక్స్ తో చేసిన ట్రాక్స్ యాక్షన్ సీన్స్ ని మరింత స్టైలిష్ గా ప్రెసెంట్ చేసింది.

  కార్తీక్ ఘట్టమనేని  కధ, కధనం, దర్శకత్వం తో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లో కూడా తనకున్న అనుభవం తో కినేయం స్టైలిస్ గా వచ్చేలా చేసుకొన్నారు. మరో ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ తో కొన్ని షెడ్యూల్స్ లో పని చేయించుకొన్నా,  మరో ఎడిటర్ తో కలిసి ఎడిటింగ్ పనిచేసినా వారి కి కూడా క్రెడిట్స్ ఇవ్వడం చాలా గొప్ప విశయం అని చెప్పవచ్చు. ఈగల్ సినిమా కి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రాణం అని చెప్పవచ్చు.  ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.

నిర్మాత టి జి విశ్వప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలు నిర్మించాలి అంటే డబ్బు తో పాటు సినిమా మీద ఫ్యాషన్ కూడా ఉండాలి. ఇలానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతి సినిమాను వ్యాపార దృక్పధం తో కాకుండా ఫ్యాషన్ తో నిర్మించడం గొప్ప విశయం.

eagle movie review by18fms 1

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

మాస్ రాజా రవితేజ తో  ధమాకా అంటూ భారీ హిట్ చిత్రాన్ని ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం లో వచ్చిన ఈ  ‘ఈగల్’ సినిమా  భారీ, స్టైలిష్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాగా కొంచం సోషల్ మెసేజ్ తో  వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటన, లుక్  మరియు యాక్షన్ సీన్స్చాలా బాగున్నాయి. సహదేవ్ వర్మ గా రవితేజ పాత్రలో విలీనం అంతకు ముందు ఈగల్ పాత్ర  తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి.

ఓక రకంగా చెప్పాలి అంటే ఈ జెనరేశన్ యువత కోరుకొనే స్టైల్ లో సినిమా ని మలచడం లో కధ, కధనం, దర్శకత్వం, సినిమాటో గ్రఫీ తో పాటు ఎడిటింగ్ కూడా నిర్వహించిన కార్తీక్ ఘట్టమనేని ని అభినందించాలి. ముఖ్యంగా క్లైమాక్స్ కి బిఫోర్ వచ్చే 40 మినేట్స్ విజువల్స్ అయితే ఇంగ్షీషు సినిమా రేంజ్ లో ఉన్నాయి.

ఐతే, సినిమా కధ లో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ తెర మీదకు వచ్చేటప్పటికి యాక్షన్ అండ్ విజువల్స్ డామినేట్ చేయడం, స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వలన రెగ్యులర్ సినిమా ఆశించే ప్రేక్షకులకు ఈగల్ లొని ఎమోషన్ ,కాన్ ఫ్లిక్ట్  పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు.

ఓవరాల్ గా ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు నిర్మాతల కమిట్మెంట్ టువర్డ్స్ క్వాలిటి స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్, దర్శకుడి టేకింగ్ మరియు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి. పక్కా టాకీస్ లో చూడవలసిన పైసా వసూల్ మాస్ సిన్మా అని చెప్పవచ్చు. దియేటర్స్ లో  ఈగల్ విజువల్స్ తో పాటూ సౌండ్ కూడా రెసౌండ్ చేస్తుంది.

చివరి మాట: మొండోడి స్టైలిష్ వైల్డ్ యాక్షన్ డ్రామా !

18F RATING: 3.5 / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *