DUNKI Drop5 Song “O Mahi” Launched: .షారూక్ ఖాన్ ‘డంకీ’ ప్రమోషనల్ సాంగ్‌ విడుదల

IMG 20231211 WA0041 e1702271511626

 

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే డంకీ డ్రాప్ 1లో విడుదలైన వీడియో, డంకీ డ్రాప్ 2లో విడుదలైన ‘లుట్ పుట్ గయా..’ పాట, డంకీ డ్రాప్ 3లో విడుదలైన ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే..’ పాట, డంకీ డ్రాప్ 4లో రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

దుంకి సినిమా కి రోజు రోజుకీ ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం మేకర్స్ డంకీ డ్రాప్ 5 అంటూ ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.

రీసెంట్‌గా షారూక్ తన అభిమానులు, నెటిజన్స్‌తో #AskSRK సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఓ మాహీ..’ సాంగ్ తనకెంతో ఇష్టమని చెప్పటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.

https://x.com/iamsrk/status/1734028995552067585?s=46&t=5RIwNRycJ8MV9YSxIBI6Fg

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *