Dundigal Vinay Raj Won a Nandi Award : న‌టుడు దుండిగల్ వినయ్ రాజ్‌కు నంది అవార్డు !

IMG 20240131 WA0118 e1706700826425

 సినీ న‌టుడు దుండిగల్ వినయ్ రాజ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. హైద‌రాబాద్ ర‌వీంధ్ర‌భార‌తీలో నంది అవార్డు అందుకున్నారు. అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుక‌లో దుండిగల్ వినయ్ రాజ్‌ను స‌త్క‌రించి అభిలాష‌ నంది అవార్డును అందించారు.

వినయ్ రాజ్ ప‌లు సినిమాల్లో దేవుళ్ల పాత్ర‌లు పోషించారు. ‘శ్రీ రంగనాయక‘ చిత్రంలో విష్ణుమూర్తిగా న‌టించిన ఆయ‌న‌, రాముడు, కృష్ణుడు వంటి పాత్ర‌లు కూడా చేశారు. హ్యాండ్సమ్ లుక్ ఉన్న వినయ్ రాజ్ చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు.

 

అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకరాలు, అధ్యక్షురాలు డా. ఎస్. సరోజినమ్మ మాట్లాడుతూ.. పౌరాణిక పాత్ర‌లు చేయ‌డంలో దుండిగల్ వినయ్ రాజ్ ఈ తరానికి దొరికిన సినీ ఆణిముత్య‌మ‌ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నటి పూర్ణిమ , నిర్మాత రామసత్యనారాయణ , దైవజ్ఞ శర్మ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *