దుల్కర్ సల్మాన్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బహుభాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్. ఎన్నో వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో ఆయన మెప్పిస్తున్నారు. ఈ విలక్షణత కారణంగానే ఆయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటివే అందుకు ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బ్యానర్స్ మద్ధతుతో రూపొందుతోన్న ఈ సినిమా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మేకర్స్ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటూ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
Glimps Review:
ఈ గ్లింప్స్‌ను గమనిస్తే మన సాధారణ జీవితంలో కనిపించే క్షణాలను అందంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా కనిపిస్తూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చారు. చివర్లో ఓ స్కూల్ గర్ల్ పరుగెత్తే సీన్ ఎంత సాదాసీదాగా ఉన్నా అది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ గ్లింప్స్‌కి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఈ గ్లింప్స్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
గ్లింప్స్‌లో దుల్కర్ సల్మాన్ ప్రెజన్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంది. డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకోవటంలో దుల్కర్ తన ప్రత్యేకతను మరోసారి చూపించారనే విషయం గ్లింప్స్‌తో స్పష్టమైంది. ఆయన నటనకు పవన్ సాధినేని క్రియేటివ్ విజన్ తోడై ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ఓ మెమొరబుల్ మూవీగా మన ముందుకు రానుంది.
సినిమాలోని గొప్ప భావోద్వేగాలుంటాయనే విషయం గ్లింప్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ మరింత ప్లస్ అవుతున్నాయి.
ఇంత చక్కటి నటీనటులు, టెక్నికల్ టీమ్ కాంబోతో ‘ఆకాశంలో ఓ తార’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటోంది.
నటీనటులు :
దుల్కర్ సల్మాన్ తదితరులు..,
సాంకేతిక వర్గం :
దర్శకత్వం – పవన్ సాధినేని, రచన – గంగరాజు గుణ్ణం, సంగీతం – జి.వి.ప్రకాష్, సినిమాటోగ్రఫీ – సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్ – శ్వేత సాబు సిరిల్, నిర్మాతలు – సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం, బ్యానర్ – లైట్ బాక్స్ మీడియా, సమర్పణ – గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా.