DSR Films New Movie MAHAR YODH 1818 opens: డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం !

IMG 20231026 WA0137 e1698324602738

 

తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం. కోరుకుంటారు .సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం వారి నైజం. ఇది భారతీయ సినిమా ఎరిగిన సత్యం. తెలుగులో ఎందరో ఔత్సాహికులు సాధిస్తున్న సినిమా విజయాలే ఇందుకు నిదర్శనం.

ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు.. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.

IMG 20231026 WA0136

డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ ఛార్మింగ్ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య రాజ్ బకుని హీరోయిన్స్ గా.. రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ చిత్రం “మహర్ యోధ్ 1818”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో అక్టోబర్ 26 న షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.

IMG 20231026 WA0138

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏ.పి. యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అగ్ర దర్శకుడు నక్కింటి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని, సినిమా విశేషాలను మీడియాకు వెల్లడించారు.

IMG 20231026 WA0139

నటీ నటులు:

హీరో రజత్ రాఘవ్, హీరోయిన్ ఐశ్వర్య రాజ్ బకుని తదితరులు.

 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ , నిర్మాత : సువర్ణ రాజు దాసరి, దర్శకత్వం: రాజు గుడిగుంట్ల , సంగీతం : మహా-శశాంక్ ద్వయం, సినిమాటోగ్రాఫర్ : వెంకట్ , ఎడిటింగ్ : నందమూరి హరి , పి. ఆర్. ఓ : శ్రీధర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *