DSP Mass Sing for Vishal Rathnam: విశాల్ ‘రత్నం’ కోసం  మంచి మాస్ బీట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

IMG 20240316 WA0024 e1710562256277

మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో విశాల్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.

విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది.

IMG 20240315 WA0131

జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ‘ఇలా కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు.

ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒకటి ఇస్తాడు. నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను. హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా? అని అనిపిస్తుంది’ అని అన్నారు.

శ్రీమణి రాసిన ఈ ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. రత్నం షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *