“డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ రివ్యూ!

IMG 20241129 WA0295 e1732895972764

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి“. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు.

కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘సర్రంటు కరెంటు షాక్ కొట్టినట్టు, నరాలు గుర్రాలై దౌడు తీసినట్టు, బుర్రంత గిర్రంటు సుట్టు తిరిగినట్టు, కిర్రెక్కి కిర్రాకు లవ్వు పుట్టినట్టు బాగి బాగి బాగి సూడరాదే కొంచెం ఆగి, బాగి బాగి బాగి గుండె కొట్టుకుందె కొంచెం ఆగి…’ అంటూ యూత్ ఫుల్ లవ్ సాంగ్ గా ఆకట్టుకుంటుందీ పాట. ఈ సాంగ్ లో హీరో ధర్మ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.

నటీనటులు:  ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు..

టెక్నికల్ టీమ్ :

కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ,ఎస్ఎఫ్ఎక్స్ – రఘు,వీఎఫ్ఎక్స్ – సుమరం రెడ్డి,ఆర్ట్ – లావణ్య వేములపల్లి, కొరియోగ్రఫీ – భాను, మోయిన్, డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి, మ్యూజిక్ – శ్రీ వసంత్, లిరిక్స్ – చంద్రబోస్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ , రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *