చిన్నగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకుంటున్న “డ్రింకర్ సాయి”

Drinkarssai e1735826317338

ఇయర్ ఎండ్ లో చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది “డ్రింకర్ సాయి” మూవీ. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూసి స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అంటూ అటు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. “డ్రింకర్ సాయి” లోని కథా కథనాలు మేకింగ్ అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది.

తెలంగాణతో చూస్తే ఏపీలో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి. రూరల్ ఏరియాల్లో సైతం ఇంప్రెసివ్ కలెక్షన్స్ అందుకుంటోంది “డ్రింకర్ సాయి” సినిమా. ఫన్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ, సూపర్ హిట్ మ్యూజిక్, ఫైట్స్..ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Drinkarsai success

“డ్రింకర్ సాయి” చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

నటీనటులు:

ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్: 

కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ, స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA), వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్, ఆర్ట్ – లావణ్య వేములపల్లి, కొరియోగ్రఫీ – భాను, మోయిన్, డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి, మ్యూజిక్ – శ్రీ వసంత్, లిరిక్స్ – చంద్రబోస్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్, రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *