గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా దుల్కర్ సల్మాన్ తో ‘ఆకాశంలో ఒక తార’

IMG 20250202 WA0204 e1738508974932

మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు.

లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి.

IMG 20250202 WA0205

‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు.

IMG 20250202 WA0206

నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం:

దుల్కర్ సల్మాన్ తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్: లైట్ బాక్స్ మీడియా, నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం, సమర్పణ – గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, దర్శకుడు: పవన్ సాదినేని, రచయిత: గంగరాజు గుణ్ణం, DOP: సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్ : శ్వేత సాబు సిరిల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *