DOSTAN MOVIE TEASER RELEASED: “దోస్తాన్” టీజర్ విడుదల

93148FD3 C233 4EB9 B424 AD0DF67755C4

 

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు చిత్ర టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

BF44436B 594D 40B6 AA06 491916CDF84F

ఈ సందర్బంగా..ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు “దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

DBA0EFAD 42E7 49C4 9150 EB524E47E049
నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మాట్లాడుతూ.. కదిరిలో ఉన్న సూర్యనారాయణ గారు అన్నవరం లో ఉన్న హీరోతో వైజాగ్, రాజమండ్రి లలో విజయవంతంగా షూటింగ్ చేసుకొని “దోస్తాన్” అని మంచి టైటిల్ పెట్టారు.ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ బాగున్నాయి.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ..మంచి ప్లానింగ్ తో ఫ్రెండ్స్ టైటిల్ తో తీసిన “దోస్తాన్” సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడు తూ.. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో ఇంతకుముందు ప్రేమదేశం, ప్రేమసందేశం వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ తమకున్న వాటిని షేర్ చేసుకుంటూ ఎలా లీడ్ చేశారో అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ “దోస్తాన్” చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు మాట్లాడుతూ..మా “దోస్తాన్” చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ధన్యవాదాలు.నా భార్య కోరిక మేరకు నేను సినిమా తియ్యాలని ఎన్నో కథలు విన్నాను. అవేవి నాకు నచ్చలేదు.సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను.

తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ఈ సినిమా పూర్తి చేయడానికి 96 రోజులు పట్టింది. ఇందులోని ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి.

నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
70A79F75 4A7B 4B9B 9F69 1461C5BAFD2A

చిత్ర హీరో సిద్ స్వరూప్ మాట్లాడుతూ.. మా దోస్తాన్ చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు..చిన్నతనం లోని ఫ్రెండ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టిన దోస్తాన్ టైటిల్ తో వస్తున్న ఇది నా మొదటి చిత్రం.

సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

మరో నటుడు కార్తికేయ మాట్లాడుతూ.. సిద్ శ్రీరామ్ డే, & నైట్ కష్టపడి స్క్రిప్ట్ ను తయారు చేశాడు. కొత్త వారిని పెట్టిన సినిమాలకు డబ్బురాదనీ తెలిసికూడా మమ్మల్ని నమ్మి తీసిన దర్శక,నిర్మాతకు ధన్యవాదములు

చిత్ర హీరోయిన్ ప్రియ వల్లబి మాట్లాడు ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు

సిద్ స్వరూప్ , కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు
మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్
డి. ఓ. పి : వెంకటేష్ కర్రి, రవి కుమార్
ఎడిటర్ : ప్రదీప్ చంద్ర
పి . ఆర్ ఓ : మధు వి. ఆర్
ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్
అసిస్టెంట్ డైరెక్టర్ : కౌసిక్ కాయల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *