DON360 Movie Trailer Launch: మొబైల్ యాప్ కాన్సెప్ట్ తో యాక్షన్ ప్యాక్ మూవీ గా  డాన్ 360 మూవీ!

IMG 20231201 124222 e1701415762522

డాన్ 360 ఒక మొబైల్ యాప్ తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ ప్యాక్ మూవీ గా మన ముందుకు రాబోతుంది దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్లో మూవీ టీం పాల్గొని మూవీ మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము అన్నారు. మా సినిమా కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అర్చన అనంత్ గారు మరియు సతీష్ సారిపల్లి గారికి చిత్ర నిర్మాత ఉదయ్ రాజ్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈవెంట్ కి విచ్చేసి ఆశీర్వదించిన రామకృష్ణ గౌడ్ గారికి కూడా  ఉదయ్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

IMG 20231201 WA00471

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో భరత్ కృష్ణ మాట్లాడుతూ : ఒక కొత్త కాన్సెప్ట్ తో నేను రాసుకున్న కథని నీ ముందు తీసుకొస్తున్నాను చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆశీర్వదిస్తారు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కథ చెప్పగానే నచ్చి మా ఈ సినిమాని ప్రోత్సహించి ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అర్చన అనంత్ గారు మరియు సారిపల్లి సతీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

IMG 20231201 124329

 

హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ : డైరెక్టర్ కాదో చెప్పినప్పుడు ఎంతో ఎక్సైటింగ్ అనిపించింది. కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతున్నాం మీరు సపోర్ట్ ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాము అన్నారు.

సతీష్ సారిపల్లి గారు మాట్లాడుతూ : భరత్ కృష్ణ చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న కొత్త డైరెక్టర్ అన్నట్టు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి లాగా సినిమా తీశాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

IMG 20231201 WA0046

 

నటీనటులు:

భరత్ కృష్ణ, ప్రియా హెగ్డే, శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్ మరియు సతీష్ సారిపల్లి

 

సాంకేతిక వర్గం: 

ప్రొడక్షన్ : జె ఎస్ ఎంటర్టైన్మెంట్స్, డి ఓ పి : శ్రవణ్, మ్యూజిక్ : రాజ్ కిరణ్, యాక్షన్ : శాలిని మల్లేష్, సింగర్ : జావేద్ అలీ, ఎడిటర్ : బాలరాజు బుక్య, నిర్మాత: ఉదయ్ రాజ్ వర్మ, రచయిత మరియు దర్శకత్వం : భరత కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *