డీజే టిల్లు-2 షూటింగ్‌ ప్రారంభం అయినట్టే నా .. దర్శకుడు మారాడు ఎందుకో తెలుసా ? సోషల్ మీడియా లో టిల్లు హాల్ చల్

WhatsApp Image 2022 09 27 at 3.20.56 PM

ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ‘డీజే టిల్లు’ మంచి బ్రేక్‌ ఇచ్చింది. సెకండ్ వేవ్‌ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. ఈ ఏడాది మార్చి 12 విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వ‌సూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా యూత్‌లో సిద్ధూకు ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కమర్షియల్‌గానూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఇక ఈ మూవీ సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

తాజాగా డీజె టిల్లు సీక్వెల్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కారు సీన్‌తో షూటింగ్‌ స్టార్ట్‌ అయినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సీక్వెల్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్ట్‌టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ క‌థ‌ను అందించడం విశేషం. కాగా ఈ సీక్వెల్‌ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ‘అద్భుతం’ సినిమాకు దర్శకత్వం వహించిన మల్లిక్‌ రామ్‌ ‘డీజే టిల్లు’ పార్ట్‌-2ను రూపొందిస్తున్నాడు. కాగా మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్‌ కృష్ణ.. హీరోతో బేధాబిప్రాయాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *